విజయం దిశలో దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ భారీ ప్రచారం..!
టూత్ పేస్ట్ గుర్తుకే మన ఓటు..
దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
దోమకొండ గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం దిశలో భారీ బైకు ర్యాలీతోపాటు , ఇంటింటా ప్రచారం మంగళవారం ప్రచారం ముగించారు. దోమకొండ ప్రచారంలో కొనసాగిస్తూ తగ్గేదేలే అంటు ప్రచారంలో దూసుకుపోతున్న దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న్ లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం స్పీడ్ కొనసాగించి ప్రచారం ముగించారు. దోమకొండ సర్పంచ్ గా గతంలో ఎంతోమందికి అవకాశమిచ్చారని దోమకొండ భవిష్యత్తు యువతరం కోసం అవినీతి లేని పంచాయతీ పాలన అందించడం కోసం ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం దోమకొండ ప్రజలు ఇవ్వాలని విన్నపించారు. ఇంటింటికి పున్న లక్ష్మణ్ తన ఎన్నికలలో టూత్ పేస్ట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. సర్పంచ్ గా గెలిపిస్తే దోమకొండ పంచాయతీలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలు మెచ్చే, గ్రామ ప్రజల అంగీకారం మేరకు పాలనను అందిస్తానని అన్నారు. దోమకొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కొత్తగా ఎన్నికల్లో పాల్గొన్న నాకు అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అందించాలని అన్నారు. దోమకొండను మోడల్ గ్రామంగా ఏర్పాటు చేయడమే లక్ష్యమని అన్నారు. అవినీతికి తావు లేకుండా గ్రామ అభివృద్ధి, మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని అన్నారు. దోమకొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు, ఐటిఐ కళాశాల, దోమకొండ డివిజన్ గా ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయడం, పెరుగుతున్న దోమకొండ జనాభా ఆధారంగా వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడమే అన్నారు. దోమకొండ పాట తాలూకా కేంద్రమైన దోమకొండను అసెంబ్లీ నియోజకవర్గం గా 2029 లో కేంద్ర ప్రభుత్వం చేయడానికి పరిశీలిస్తుందని అన్నారు. నీతివంతమైన పాలన కోసం అవినీతి లేని సర్పంచ్ని ఎన్నుకోవాల్సిన అవసరం దోమకొండ గ్రామ ప్రజలపై ఉందని అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ అభ్యర్థి పున్న లక్ష్మణ్ తో పాటు ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.


