ఉపాధి పనులలో కూలీలను పెంచాలి
జేఈ ప్రదీప్ కుమార్
తుగ్గలి ఏప్రిల్ 16 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల లో కూలీలు ఎక్కువమంది పాల్గొనే విధంగా చూడాలని జూనియర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జూనియర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కార్యాలయం లో విలేకరుల తో జూనియర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోనే ఎవరు ఇతర ప్రాంతాల కు వలసలు వేయకుండా స్థానికంగా వారికి ఉపాధి పనులు కల్పించే బాధ్యత టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు దేనని ఆయన తెలిపారు. అలాగే కూలీలకు 272 రూపాయలు వేతనం పడేవిధంగా కూలీలు చేత పనులు చేయించేందుకు కూలీలకు అవగాహన కల్పించాలన్నారు .కూలీలు ఉదయం 7 గంటలకు వెళ్లి 11 గంటల లోపల పనులు ముగించుకొని ఇంటికి వచ్చే విధంగా చూడాలని ఆయన తెలిపారు. ఎవరైనా వలసలకు వెళితే సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు బాధ్యతని ఆయన తెలిపారు. పనులకు వచ్చిన కూలీలకు ఆన్లైన్లో మాస్టర్ వేసే సమయంలో మేటీలకు తగు జాగ్రత్తల ను టెక్నికల్ అసిస్టెంట్లు ,ఫీల్డ్ అసిస్టెంట్లు తెలియజేయాలని ఆయన తెలిపారు. అలాగే పనులకు రాని కూలీలకు హాజరు వేస్తే సంబంధిత మేటీలను పనుల నుండి తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. బోరు బావులు ఉన్న రైతులు తమ పొలాల్లో పండ్ల మొక్కల ను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులను గుర్తించి వారి చేత పండ్ల మొక్కలు నాటించాలని ఆయన తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..