ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం …

 

జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వసిద్ధి పీ.హెచ్.సి పరిధిలో గల అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి పెనుగొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామ సచివాలయాలు లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ లు, శిబిరాలు జిల్లా మలేరియా అధికారి కె. వరహాల దొర ఆదేశాల మేరకు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్. వాసంతి సంయుక్తంగా తెలిపారు.అదేవిధంగా సర్వసిద్ది, లింగరాజుపాలెం, ఎస్. రాయవరం పెనుగొల్లు ధర్మవరం గ్రామాల్లో జిల్లా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ పి.జె .ఎమ్.అర్.పి. నాయుడు సూచనలు అనుసరించి నిర్వహించిన అవగాహన ర్యాలీ ల్లో ఆరోగ్య విస్తరణ అధికారులు బి.సత్యనారాయణ, తంటపు రెడ్డి నాగేశ్వరరావు పర్యవేక్షణలో హెల్త్ విజిటర్ సి.హెచ్. రవణమ్మ, ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్ మరియు మలేరియా ఇంఛార్జి నోడల్ ఆఫీసర్ పి. ఎన్ .వి .ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వై .అనుష రమాదేవి, లిల్లీ,ఆశిషెన్ టోప్నో సచివాలయం హెల్త్ సెక్రటరీలు రాజేశ్వరి, పీ. నూక రత్నం, పి .శ్రీరాములు ఆశా, ఓ .వేణు, సచివాలయం ల సిబ్బంది ,గ్రామపెద్దలు, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలేరియా ఇన్చార్జి నోడల్ ఆఫీసర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాల్లో చెత్త చెదారం లేకుండా ,పాడుబడిన ప్లాస్టిక్ డబ్బాలు, డ్రింక్ బాటిల్స్ పరిసరాల్లో లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అలాగే ఇంట్లో గానీ ఇంటి సమీపంలో గాని నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని నీటి నిల్వలు ఉన్నట్లయినా వాటిపై మూతలు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలని రుబ్బురోళ్లు, ఫ్రిడ్జ్ వెనక తొట్టెలు, ఎయిర్ కూలర్లు, పూల కుండీలు, టైర్లు ,సిమెంట్ గోలాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, షూలు, డ్రింక్ బాటిల్స్ వీటిలో నీరు నిల్వ ఉండకుండా మీరు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లు అయినా ఆ దోమ నిలువ వున్న మంచి నీటి పాత్రలు ల్లో గుడ్లు పెట్టి తద్వారా సంతాన ఉత్పత్తి చేయకుండా అడ్డుకట్ట వేయగలమని అదే ఏడిస్ ఈజిప్ట్ అనే టైగర్ దోమ పేరుతో మన ఇంటి పరిసరాల్లోనే పెరిగే ఈ దోమ వంటిపై నల్లని ,తెల్లని మచ్చలు ఉంటాయని దీన్ని సులభంగా గుర్తించవచ్చుననీ. దీని కాటు వలన డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లెట్ రక్త కణాలు సంఖ్య శరీరంలో క్షీణించి తదుపరి శరీరం లోపల అంతర్గత అవయవాలలో రక్తస్రావం కలిగి, దానితోపాటు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్ గా పరిణామం చెంది మన ప్రాణానికి ముప్పు తెస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఈ డెంగ్యూ దోమలు పెరగకుండా నిర్మూలించాలంటే పైన చెప్పిన అన్ని జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే డెంగ్యూ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలమని తద్వారా మనము ,మన కుటుంబం, మన గ్రామము, మన రాష్ట్రం, మన దేశం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండవచ్చునని ప్రసాద్ ప్రజలకు సూచించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!