*వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 16 (అఖండ భూమి న్యూస్);
వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై జాతీయ వైద్య కమిషన్ కీలక ఆదేశాలు
చేతిరాత స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచన
పర్యవేక్షణకు ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు
జనరిక్ పేర్లతోనే మందులు రాయడం తప్పనిసర
వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు (మందుల చీటీలు) స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వైద్యులు మందులు రాసే పద్ధతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది.
You may also like
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి…
దోమకొండ ఊరడమ్మకు గడికోట వారసులు బోనాల సమర్పణ…
బిఆర్ఎస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిన గైని శ్రీనివాస్ గౌడ్…
క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ముందు టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


