*సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 15 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను నేడు *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు స్థానిక రాజారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన *బీజేపీ విసృత స్థాయి కార్యకర్తల సమావేశం అనంతరం సన్మానం చేయటం* జరిగింది.
కార్యక్రమంలో మొదట ఓటమి కి గల కారణాలను, గ్రామాల పరిస్థితులను పోటీ చేసిన అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి లో స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం లేకుండా ప్రజా సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వారిని గెలిపించుకోవాలని ప్రయత్నంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు అని, ఓడిన వారు కూడా అధైర్య పడొద్దు అని అన్నారు. డబ్బు, మద్యం లేకుండా గెలిస్తే తన 5 ఏళ్ల పదవి కాలంలో ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని, అందుకే బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మద్యం, డబ్బు లేకుండా సర్పంచ్ ఎన్నికల్లో పోటో చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఇదే స్పూర్తితో రాబోయే MPTC, ZPTC ఎన్నికల్లో కూడా పోటీ చేసి ప్రజల వద్దకు వెళతామని అన్నారు. అవినీతి రహిత కామారెడ్డి కోసం చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు తప్పవని అన్నారు. ఏది ఏమైనా. ప్రజా తీర్పును శిరసావహిస్తామని అన్నారు.
అనంతరం వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను శాలువా తో సన్మానం చేశారు.


