హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ మాధవీ లత gaaru, జస్టిస్ లక్ష్మీనారాయణ గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు, గారికి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి పి. ముక్తిదా గారు, జిల్లా న్యాయాధికారులు గౌరవ న్యాయమూర్తులను ఆహ్వానించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ గారు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్. భారత లక్ష్మి గారు, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల న్యాయాధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని గౌరవ న్యాయమూర్తులకు ఆత్మీయ స్వాగతం పలికారు.
తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి వివిధ న్యాయస్థానాల పనితీరు, న్యాయ పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


