*సీనియర్,జూనియర్ విద్యార్థులు పరస్పరం సహృద్భావంతో మెలగాలి…
__డా. రవీందర్ రెడ్డి, చీఫ్ వార్డెన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 20 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో శనివారం జరిగినటువంటి ఇండక్షన్ ఆంటీ ర్యాగింగ్ ప్రోగ్రాంలో తెలంగాణ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థి జీవితం చాలా అమూల్యమైనదని దానిని సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థుల మధ్య మరియు విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య సమన్వయ సంబంధాలు కొనసాగాలని అప్పుడు మాత్రమే ఏ సమస్యలు లేకుండా యూనివర్సిటీ అభివృద్ధి , విద్యార్థుల విజయాలు సాధ్యం అవుతాయని తెలిపారు. చదువుతోపాటు సంస్కారం కూడా అలవర్చుకుంటేనే జీవితం సక్రమ మార్గంలో నడుస్తుందని తెలిపారు. విద్యార్థి దశలో జీవితంలో ఎప్పుడైనా జయాపజయాలను సమానంగా ఆస్వాదించాలని అప్పుడే జీవితంలో అడుగు ముందుకు వేయగలమని తెలిపారు. విద్యార్థులుగా అందరూ కలిసి ఉండాలని ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలి అన్నారు. సంబంధం లేని విషయాలలో తలదూర్చడం వల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ అంజయ్య, డాక్టర్ హరిత మరియు హాస్టల్ వార్డెన్ డాక్టర్ సునీత,apro డా.సరిత పిట్ల, డా.రమాదేవి మిగతా అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


