*ప్రజావాణిలో 60 దరఖాస్తులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 22 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి లో మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, డీడబ్ల్యూఓ (DWO), వ్యవసాయం, విద్య, వైద్యం, పెన్షన్ తదితర శాఖలకు సంబంధించిన 60 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జడ్పీ సీఈఓ చందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


