దోమకొండ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలి…

దోమకొండ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 22 (అఖండ భూమి న్యూస్);

దోమకొండ. ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్ అనిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోమవారం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో దోమకొండ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య మాట్లాడుతూ గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోసం ఊర పండగను నిర్వహిస్తామనీ ,దోమకొండ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సభ్యులతో కలిసి అభివృద్ధి కృషి చేస్తామని, తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్ , రాష్ట్ర ఖరీజభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవత్రి అనిల్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, కైలాస్ శ్రీనివాసరావు, అనంతరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జడ్పిటిసి తిరుమల్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

దోమకొండ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఖానిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్ అనిల్

Akhand Bhoomi News

error: Content is protected !!