ఆయన అలుపెరుగని దేశభక్తుడు.! మాజీ ప్రధాని వాజ్ పాయ్ సుపారిపాలన దినోత్సవం…

ఆయన అలుపెరుగని దేశభక్తుడు.! మాజీ ప్రధాని వాజ్ పాయ్ సుపారిపాలన దినోత్సవం…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 25,(అఖండ భూమి న్యూస్);

ఆయన ఒక కవి ,వక్త, జనసంఘ్ వ్యవస్థాపకుడు. భారతీయ జనతాపార్టీ వ్యవస్థపక అధ్యక్షుడు.అతివాద ముద్ర ఉన్న,హిందుత్వ ముద్ర ఉన్న కూడా ఆయన మితవాదిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్లో పుట్టిన అటల్ బిహారీ వాజ్పేయి చదువులోను దిట్ట .క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షణను అనుభ వించారు. మొదట 2 వ లోకసభలో ప్రాతినిథ్యం పొంది 3,9 వ లోకసభలు మినహాయించి 14 వ లోకసభ వరకు ప్రాతిని త్యంవహించారు.రెండుపార్యాయలు ప్రాతినిత్యం తో పాటు మురార్జీ దేశాయి ప్రభుత్వం లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి ఐక్యరాజ్య సమితి లో సాధారణ సభలో మొట్టమొదటి సారి హిందీలో ప్రసంగించి ఖ్యాతి గడించారు.1996 లో ప్రధాని గా బాధ్యతలు చేప ట్టిన ఒక్క ఓటు తేడాతో ఓడిపోయి పదమూడు రోజులకే పదవి కోల్పోయినాడు. 1998 లో 13 నెలలు ప్రధానిగా పని చేసి అప్పటి ఎ ఐ. డి.ఎం కె మద్దతు ఉపసంహరణ తో పదవి కోల్పోయిన 1999 లో ఎన్. డి.ఏ కూటమి ఆద్వ ర్యం లో ప్రధాని పదవి చేపట్టి అనేక సంస్కరణలు తెచ్చారు. అందులో గ్రామీణ సాడక్ యోజన,అంతర్జాతీయ ఒత్తిడులు ఎన్ని ఉన్నా పోక్రన్ అణు పరీక్షలు విజయవంతంగా నిలిపి అన్వయుధ దేశంగా మల్చినడు. కార్గిల్ విజయం నమోదులో,లాహోర్ బస్ యాత్ర వంటి మైత్రిబంధం పెంచుకోవాలని చూసిన పాకి స్తాన్ కుతంత్రాలు మానలే దు.1994 లో ఉత్తమపార్లమెం టేరియన్ గా అవార్డ్ దక్కడమే కాకుండా మోడీ ప్రభుత్వం భారతరత్న అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృత, భాషలో మంచిదిట్ట,దేశ విభజన సమయంలో న్యాయవాద విద్యకు ఆటంకం ఏర్పడింది. అయిన అనారోగ్యంతో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 25 న సుపారిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఆయన బ్రహ్మచారి,మచ్చలేని దేశ భక్తుడు.రాజకీయమైన విబే ధాలు తప్ప వ్యక్తిగత శత్రుత్వం లేని అజాత శత్రువు.ఆయన మృదు స్వభావి కవితాత్మకంగా ప్రసంగించే వారు. అతని వాగ్దాటి ముగ్దుడు అయిన నెహ్రు ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని అవుతారు. అని ఆనాడే కితాబు ఇచ్చారు. ఆయన మరణంలేని భారతీయ ఆత్మ .ఆటల్ జీ కి కూడి భుజం ఎల్.కె అద్వానీ. నేటి బి.జె.పి స్థితికి నారు పోసి నీరు పోసింది వీరు ఇరువురు.

Akhand Bhoomi News

error: Content is protected !!