ఈజీఎస్ లో మహాత్మా గాంధీ పేరు మార్పులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా..!

ఈజీఎస్ లో మహాత్మా గాంధీ పేరు మార్పులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా..!

ఈజీఎస్ లో మహాత్ముని పేరు మార్చాలని అనుకోవడం సిగ్గుచేటు..

దోమకొండ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 28 (అకాండ భూమి న్యూస్);

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరులో జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కోవడం దోమకొండ గాంధీ చౌక్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పేరు తొలగించాలని నిర్ణయంపై దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నల్ల బ్యాడ్జీలను పెట్టుకొని వినూత్న తరహాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్ముని పేరు తొలగించకుండా ఉపాధి హామీ పనులను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల గౌడ్ ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆబ్రబోయిన స్వామి, దోమకొండ సర్పంచ్ ఐరేని నరసయ్య, అండెం శంకర్ రెడ్డి,రావులపల్లి నర్సారెడ్డి, నల్లపు శ్రీనివాస్ తాటిపల్లి శ్రీకాంత్, సీతారాం మధు ముదిరాజ్, కదిరే గోపాల్ రెడ్డి, పన్యాల నాగరాజు రెడ్డి, షమ్మీ,, సాహెబ్ గారి రాజు,పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, నహీం, గోసాల్పల్లి నర్సింలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!