*జిల్లా విద్యాధికారిచే ఇంగ్లీష్ టీచర్ కర పుస్తకం ఆవిష్కరణ* 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు ఆంగ్ల ఉపాధ్యాయుల కొరకు ఇల్ట ELTA (ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో తయారుచేయబడిన పదవతరగతి ఆంగ్ల పుస్తక కరదీపికను (హ్యాండ్ బుక్) శనివారం ఉపాధ్యాయులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ రాజు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయ కరపుస్తకం ఆంగ్ల భాష ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉందని, విద్యార్థుల్లో ఆంగ్లం పట్ల భయాన్ని తొలగించడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందిచందానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, డీఎస్ఓ సిద్దరామారెడ్డి, డీసీఈబీ సెక్రటరీ నీలం లింగం, ఎల్టా కోశాధికారి విష్ణు వర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


