చైనా మంజాతో యువకుడి గొంతుకు గాయం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; డిసెంబర్ 27.
(అఖండ భూమి న్యూస్):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో గాలిపటం మాంజాతో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో మెడకు తీవ్ర గాయం (కట్) అయింది. స్థానికులు బాధితులని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు బాధితుడి గొంతుకు 19 కుట్లు వేశారు. సంక్రాంతి నేపథ్యంలో దొంగ చాటుగా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నాయి. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకముందే దుకాణా దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి, వాటిని విక్రయించే వారి సమాచారాన్ని పోలీస్ స్టేషన్లకు తెలియజేయాలి. నిషేధిత మాంజాను వినియోగించకుండా చైతన్యవంతం కావాలి….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


