*రక్తదానంలో డాక్టర్ బాలు సేవలు అభినందనీయం…
*వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేషాచలం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను హనుమకొండ లో నిర్వహించిన కార్యక్రమంలో వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేషాచలం, సమన్వయకర్త నారాయణ లు సన్మానించడం జరిగింది.వ్యక్తిగతంగా 78 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,
18 సంవత్సరాల నుండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడం,రక్తదాన శిబిరాల నిర్వహణ,యువతకు రక్తదానం పై అవగాహన సదస్సులు,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించిన మొదటి వ్యక్తిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్,ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం అభినందనీయమని అన్నారు. సేవలకు గుర్తింపును ఇచ్చినందుకు కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శకావత్,అశోక్,సంతోష్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


