ప్రభుత్వ క్రిస్మస్ సంబరాలు.. క్రిస్టియన్ భక్తులకు చేరువయ్యేనా..!
ప్రభుత్వ క్రిస్మస్ సంబరాల ఆలస్యానికి (నిర్లక్ష్యానికి) కారణం ఎవరు?
నిర్లక్ష్యానికి గురవుతున్న క్రైస్తవ సమాజం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని క్రిస్టియన్ సోదరులు ఆనంద సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గానికి రెండు లక్షల రూపాయలు క్రిస్మస్ పీస్ట్ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. యేసుక్రీస్తు బోధన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని బాహాటంగా రైల్వే స్టేడియం వేదికగా తెలియజేస్తున్నప్పటికిని కామారెడ్డి నియోజకవర్గంలో అలాంటి సందడి గాని పండగ వాతావరణం గాని కనిపించ లేదు. ప్రభుత్వం క్రిస్మస్ పండగను జరపడము అది మైనార్టీల హక్కు అని స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మైనార్టీల హక్కులను కాలు రాస్తుంది ఎవరు? అనే ప్రశ్న క్రైస్తవ సమాజంలో మెదులుతుంది. కారణం ఏమిటంటే?
నియోజకవర్గ పరిస్థితుల్లో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి చెందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి ని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు వినూత్నంగా గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ హోదా కలిగిన పదవిలో పనిచేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ప్రభుత్వ క్రిస్మస్ జరపడానికి ఎవరిని సంప్రదించాలో తెలియక క్రైస్తవ నాయకులు సతమతమవుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఎన్నుకోబడిన సిసిఓసి కమిటీ నియామకానికి విలువ లేకుండా పోతుంది. ఎమ్మెల్యే ఒక పార్టీకి చెందిన నాయకుడు, ప్రభుత్వ సలహాదారు గా అధికార పార్టీకి చెందిన నాయకుడు ఉన్నప్పటికి క్రిస్మస్ పండగ ప్రభుత్వం బాహాటంగా జరుపుతున్న దానిని సరైన క్రమములో ఎటు తేల్చుకోలేక నిర్వహించలేకపోతున్నా వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది అధికారులకు ఇబ్బందికరంగా క్రైస్తవ కమ్యూనిటీకి బాధాకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సీసీఓసి కమిటీకి ఏర్పాటు కీలకం అయింది. ప్రభుత్వం నియమ నిబంధన ప్రకారం క్రిస్మస్ సంబరాలు సిసిఓసి కమిటీ ద్వారా జరపాలని అధికారులు ఆలోచించేస్తే, క్రైస్తవ కమ్యూనిటీ పెద్దలు అనైక్యత అవగాహన లోపం, సిసిఓసి కమిటీకి తిలోదకాలు ఇచ్చి నాయకుల సమన్వయ లోపంతో, ఒక నాయకుడు వస్తే ఇంకో నాయకుడు రాకపోవడం అనే దానిపై క్రైస్తవ సమాజం ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఎవరి సమన్వయ లోపంతో ఇలా జాప్యం జరుగుతుంది అనేది క్రైస్తవ లోకంలో సందిగ్ధములో ఉన్న ప్రశ్న.
…క్రైస్తవ్యం పై చిన్న చూపా:
..అధికారులను అలసత్వమా..?
ఈ ప్రశ్నకు ప్రభుత్వము సరియైన సమాధానమిస్తుందని ఆశిద్దాం. ఒకవేళ క్రైస్తవ కమ్యూనిటీ ఐక్యతలోపమా? అధికారుల పర్యవేక్షణలోపమా? నాయకుల సమన్వయ లోపమా? క్రైస్తవ కమ్యూనిటీ పెద్దల ఐక్యమత్య అవగాహన లోపమా?,అనేది అర్థం కాక నియోజకవర్గ క్రైస్తవ సోదరులు తలలు పట్టుకుంటున్నారు. క్రిస్మస్ సంబరాలు ప్రతి గ్రామంలో వ్యక్తిగతంగా, ప్రతి చర్చ్ లో క్రిస్మస్ పండగ జరుపుకున్న తర్వాత ఆలస్యంగా ప్రభుత్వం క్రిస్మస్ జరగడంపై ఆంతర్యం ఏమిటి? అనే కోణం క్రైస్తవ సోదరుల నుంచి వినిపిస్తుంది. తూతూ మంత్రంగా జరుపుతున్న ఈ క్రిస్మస్ సంబరాలపై ఎవరి లక్ష్యం ఉంది. ప్రభుత్వ నిధులు కాజేయడానికేనా..? ఈ నిధులు మిగులు ఎవరి పాలు..? మిగిలిన నిధులపై ఎవరి వాటా ఎంత..? ఈ నియోజకవర్గంలో ఇంత ఆలస్యంగా జరగడం పై ఆంతర్యం ఏమిటి..? అని నియోజకవర్గ క్రైస్తవ సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాస్థాయి అధికారులు స్పందించాలని కామారెడ్డి నియోజకవర్గ క్రైస్తవ సమాజం కోరుకుంటుంది.


