కామారెడ్డి పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…

కామారెడ్డి పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…

 

ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదర సోదరీమణుల కోసం ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని లీమ్రా ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు.

క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేసి మహమ్మద్ అలీ షబ్బీర్ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గ మాట్లాడుతూ.

ప్రభు యేసుక్రీస్తు బోధనలు సమాజానికి శాంతి, ప్రేమ, మానవత్వాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

యేసుక్రీస్తు త్యాగం, సేవాభావం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ, మతసామరస్యాన్ని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు.

మతాల పరిరక్షణకై తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని అన్నారు

క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో క్రైస్తవులకు మరిన్ని అవకాశాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు.

ప్రతి నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమానికి నిదర్శనమని, అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని మహమ్మద్ అలీ షబ్బీర్ గారు స్పష్టం చేశారు.

కామారెడ్డి నియోజకవర్గంలో కూడా క్రైస్తవ సమాజానికి అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

క్రైస్తవ సోదరులు తమ సమస్యలను ఎప్పుడైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో క్రైస్తవ పాస్టర్లు, చర్చ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల క్రైస్తవ పాస్టర్లు, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!