వైకుంఠ ఏకాదశి రోజు ఏమి చదవాలి,సంత్సరం లో ఎన్ని ఏకాదశులు వుంటాయి
…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు
వైద్య..
కామారెడ్డి
జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29,(అఖండ భూమి న్యూస్);
మనకి మొత్తం 26 ఏకాదశు లు ఉంటాయి. ఒక సంవత్స రం లో 24 + అధికమాసంలో 2.వీటి అన్నిటిలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకం. మార్గశీర్ష బహుళ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిఅనీ, ముక్కో టిదేవతలు తిరిగే తిథి కనుక ముక్కోటిఏకాదశి అనీ, పరమై కాదశి అనీ,సాక్షాత్తూ విష్ణుస్వ రూపం కనుక కృష్ణఏకాదశి అనీ అంటారు.నారాయణుడు పాలసముద్రము లో కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. లేచాక మార్గశిర శుక్ల ఏకాదశి వరకు లోక పోష ణ కొరకు సంచారం చేస్తాడు. ఆ సమయంలో ఆయనని ఆరాధించి,ఉపాస న చేసిన వాళ్ళని రక్షించడం కోసం వైకుంఠం విడిచి, ఒక రూపం ధరించి వైకుంఠానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి7ద్వారా లు తెరుచుకుని బయటకు వస్తాడు. అలా లోక రక్షణ కొరకు బయటకు వచ్చే తిథి కనుకే ‘వైకుంఠ ఏకాదశి’ అని అంటారు. ఉపవాసం చేయ గలగిన వారుఉపవాసంచేయా లి, అసలు ఏమీ తినకుండా ఉపవాసం చేయరాదు. అది నిరాహార దీక్ష కింద లెక్క. కను క ఈ శరీరం నిలబడడానికి ఆహారంఅవసరంఅయినంతమాత్రమే అనగా పళ్లు,పాలు వంటివి తిని ఆ రోజంతా ఆ విష్ణునామస్మరణ,శివనామ స్మరణ చేసుకోవాలి.జాగరణ చేయగలగినవారు జాగరణ చేయడం చాలా మంచిది. జాగరణ అనగా కునుకు వేయకుండా ఆ భగవన్నా మస్మరణ చేస్తూ గడపాలి. పూర్తిగా జాగారం చేయలేని వారు కనీసం రాత్రి12 గంటల వరకు ఉండి కూడా పూర్తిగా జాగరణ చేసిన ఫలితం వస్తుంది.ఈ రోజున బంగారం దానంచేస్తే గొప్ప కీర్తి వస్తుంది. వెండి దానం చేసినవారి వంశం వృద్ధి చెందుతుంది. భూదానం చేస్తే దివ్య విమానం ఎక్కి వైకుంఠం చేరుకుంటారు. ఇవేమీ చేయ లేని వారు ఒక బ్రాహ్మణ కుటుంబం తినడాని కి సరిపోయేలా స్వయంపాకం ఇవ్వాలి.ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనది. ఈరో జున ఆ విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చి దేవతలను, ఆయనని నమ్మి ఉపాసన చేసిన వారిని రక్షిస్తాడు. ఉత్తర దిక్కు దేవతల స్థానం. దేవాల యం లో ఈ రోజున ఉత్తరద్వా రం నుండి వెళ్ళి విష్ణు దర్శనం చేయడం వలన ఇహలోకంలో ఋణ విముక్తి, భూ అభివృద్ధి అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగు తాయి. కుటుంబం అభివృద్ధి అవుతుంది. మోక్షం వస్తుంది.
ఒకవేళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే విష్ణు, శ్రీలలి త, శ్రీకృష్ణ, గణపతి, శివ సహ స్ర నామాలలో ఏదైనా భక్తితో పారాయణ చేసు కోవాలి. అ లా చేస్తే అన్ని దోషాలు తొలగు తాయి.


