ఉత్తమ కార్యకర్తలకు ప్రశంస పత్రాలు అందజేత

టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం అఖండ భూమి:
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన ఉత్తమ కార్యకర్తలందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హృదయపూర్వకంగా ప్రశంసిస్తూ అభినందిస్తూ వారి సేవలకు గుర్తింపుగా యర్రగొండపాలెం పట్టణంలోనీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కార్యకర్తలకు ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు పోట్ల గోవిందు,మేకల వలరాజు,మెట్టు శ్రీనివాస్ రెడ్డి, షేక్ మాబు,నాయకులు చేకూరి సుబ్బారావు,పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బయ్య,నాయకులు పెరుమాళ్ళ మల్లికార్జున రావు, శనగ నారాయణరెడ్డి,కేసనపల్లి మల్లికార్జున,కందుల నారాయణరెడ్డి,బివి సుబ్బారెడ్డి,మంత్రు నాయక్,కాకర్ల కోటయ్య,మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


