నలుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

నలుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

యర్రగొండపాలెం అఖండ భూమి:నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు వారి వద్ద రూ.5,040 నగదును స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని వీరభద్రపురం గ్రామ సమీపంలో పొలాల్లో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై పి చౌడయ్య తెలిపిన వివరాల ప్రకారం వీరభద్రపురం గ్రామం సమీపంలో నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో తనతో పాటు సిబ్బంది కూడా మారువేశాలలో అక్కడికి వెళ్లి పేకాట శిబిరంపై దాడులు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించి అదుపులోనికి తీసుకున్నట్టు చెప్పారు. వారి వద్దనుండి రూ. 5,040స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా మండలంలోని గ్రామాలలో పేకాట ఆడుతున్న అక్రమ మద్యం విక్రయిస్తున్న గంజాయి వ్యాపారం చేస్తున్న తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎక్కడైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!