మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పాటు చేసి క్యాబినెట్ లో ఆమోదించడం శుభ పరిణామం

జిల్లా ఆమోదంపై అభినందిస్తూ టిడిపి శ్రేణులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం అఖండ భూమి:మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పాటు చేసి క్యాబినెట్ లో ఆమోదించడం శుభ పరిణామం అని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు.ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా కలుస్తూ నినాదాలు చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకున్న మహా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో,పార్టీ సభ్యత్వాలు చేయించడంలో,పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలను గుర్తించి మంత్రి నారా లోకేష్ బాబు పంపించిన ప్రశంసా అవార్డులు అందజేశారు.అనంతరం యర్రగొండపాలెం మేజర్ పంచాయతీకి చెత్త సేకరణకు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన రెండు ఈ అటోలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు పోట్ల గోవిందు,మేకల వలరాజు,మెట్టు శ్రీనివాస్ రెడ్డి, షేక్ మాబు,నాయకులు చేకూరి సుబ్బారావు,పంచాయతీ కార్యదర్శి రామ సుబ్బయ్య,నాయకులు పెరుమాళ్ళ మల్లికార్జున రావు, శనగ నారాయణరెడ్డి,కేసనపల్లి మల్లికార్జున,కందుల నారాయణరెడ్డి,బివి సుబ్బారెడ్డి,మంత్రు నాయక్,కాకర్ల కోటయ్య, మస్తాన్ వలి, తెలుగు యువత నాయకులు షేక్ వలి,మహేష్ నాయుడు, అచ్యుత్ రావు, కిషోర్,గంగయ్య, తదితరులు పాల్గొన్నారు.


