2026 క్యాలెండర్ ఆవిష్కరించిన సుగాలి సంఘం న్యాయవాది నేనావత్ అశోక్ నాయక్.

పుల్లల చెరువు అఖండ భూమి డిసెంబర్ 30 న్యూస్
మార్కాపురం పట్టణంలోని గిరిజన బాయ్స్ హై స్కూల్ నందు సుగాలి సంఘం ఆధ్వర్యంలో న్యాయవాది. నేనావత్.. అశోక్ నాయక్ ఆకాంక్షలతో 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాది నేనావత్ అశోక్ నాయక్ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది నేనావత్ అశోక్ నాయక్ మాట్లాడుతూ రాబోయే నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆశ, ఆనందం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉ న్న కష్టాలు తొలగి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. అలాగే
యర్రగొండపాలెం మండల పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఎస్టి హాస్టల్ నందు సుగాలి సంఘం నిర్వహించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్స్ న్యాయవాది నేనావత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్టి హాస్టల్ విద్యార్థుల సమావేశంలో నూతన సంవత్సరం క్యాలెండర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా నేనావత్ అశోక్ నాయక్ విద్యార్థులకు పలు సూచనలు వివరిస్తూ విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణను అలవర్చుకోవాలని, రాబోయే సంవత్సరం మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు మంచి మార్కులతో ఉన్నత ఫలితాలను సాధించాలని విద్యార్థులకు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నేనావత్ అశోక్ నాయక్ , సుగాలి సంఘం పలువురు నాయకులు ప్రజలు విద్యార్థులు పెద్దలు పాల్గొన్నారు..


