ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ,జనవరి 01 (అఖండ భూమి న్యూస్);
ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీని బీబీపేట మండలానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ చంద్రా గౌడ్ లు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా నాయకులు అబ్రబోయిన స్వామి కలిశారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని, శాంతి సౌభాగ్యాలు నెలకొని, ప్రతి ఇంట్లో వెలుగులు వెల్లివిరియాలని ప్రార్థించారు. కొత్త ఏడాది ఆశలు, లక్ష్యాలు నెరవేరేలా ముందుకు సాగాలని పిలుపునిస్తూ, ప్రజల శ్రేయస్సే తమ రాజకీయ లక్ష్యమని నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


