*గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు…
*అందరూ సుఖశాంతులతో ఉండాలి
– లోయపల్లి శ్రీనివాసరావు సర్పంచి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 1 (అఖండ భూమి న్యూస్);
నూతన సంవత్సరంలో మనుషులు సుఖ సంతోషాలతో జీవించాలని, మానవత్వం విలువలు ఎరిగి మనిషిని మనిషి గౌరవించే పరిస్థితులు కలిగి, మనుషులు ఒకరినొకరు ప్రేమ సంతోషాలతో సహవాసం కలిగి జీవించాలని గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ మేనేజింగ్ ట్రస్టీ పాస్టర్ శ్రీనివాస్ సాప అన్నారు. సంగమేశ్వర్ గ్రామంలో గుడ్ ఫ్రూట్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లోయపల్లి శ్రీనివాసరావు సంగమేశ్వర్ గ్రామ నూతన సర్పంచు పాల్గొని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని భగవంతుని కోరుకుంటున్నాను అన్నారు. ప్రజలందరు ఈ నూతన సంవత్సరమూలోఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలన్నారు. గత అనుభవాలను మననం చేసుకుంటూ పాతవి వదిలి నూతన సంవత్సరంలో మరింత పట్టుదల, అవిరళ కృషితో నూతన విజయాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకొని, ఆలయ బాలయ్ తీసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాప పవిత్ర, కమలా మోహన్ రెడ్డి, రిబ్కా రాజు, కీర్తన ప్రేమ్ కుమార్, మరియమ్మ మార్కు, పున్నమ్మ రాజయ్య, సంతోష నర్సింలు, కరుణమ్మ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


