టీడీపీ ఇన్చార్జిలను కార్యక్రమాలకు పిలవడమేమిటి
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం అఖండ భూమి.
యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఉంటే టీడీపీకి చెందిన ఇన్చార్జిలను అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం ఏమిటని, వారికి పెద్దపీట వేయాలని ఎక్కడ ఉందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ శనివారం ఒంగోలులో జరిగిన డీఆర్సీ సమా వేశంలో ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ అధికారులు ప్రోటోకాల్ పాటించటం లేదన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వేదికపై టీడీపీ ఇన్చార్జికి ప్రాధాన్యత ఇవ్వడం తగదన్నారు. ఇదే విష యమై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అవసరమైతే కోర్టుకెళతామని హెచ్చరించారు. అదేవిధం గా జగనన్న కాలనీలలో వేసిన ట్రాన్స్ఫార్మర్లు తొలగిం చిన విషయంపై అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



