మహిళ సంఘాలకు పాడి పశువులు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4.
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలోని పొదుపు మహిళా సంఘాలకు త్వరలో పాడిపశువులను అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరా డైరీ ప్రాజెక్టు కింద ఒక్కో మహిళకు రెండేసి పాడిపశువులను అందిస్తామని అన్నారు. 70 శాతం శాతం సబ్సిడీ, 30% బ్యాంకు రుణం అందించి ఈ పాడిపశువులను అందించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని చెప్పారు. ముందుగా మధిరను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలను స్వసక్తితో అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


