అక్రమంగా రక్తం సేకరణ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 4.
(అఖండభూమి న్యూస్):
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నోరులేని మేకలు, గొర్రెల శరీరం నుండి రక్తాన్ని అక్రమంగా సేకరిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా, అడ్డగోలుగా రక్తం తీయడం వలన ఆ మూగజీవాలు ఒకటి రెండు రోజులలోనే ప్రాణాలు కోల్పోతున్నాయని గొర్రెల కాపర్లు పోలీసులకు చెప్పారు. ఈ రక్తం కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని గొర్రెల కాపరులకు మాయమాటలు చెప్పి, ప్యాకెట్లలో రక్తం నింపి, ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారంలో మటన్ షాప్ నిర్వాహకుని తో పాటు ఓ నకిలీ బస్సు వైద్య అధికారి సైతం భాగస్వామి కావడం విశేషం.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


