అనుభవాల పాఠంవృద్ధాప్యం
కవి,లెక్చరర్ ఉమాశేషారావు
వైద్య…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 4,(అఖండ భూమి న్యూస్) ;
మనిషి జన్మ చాలా చిత్రమైన ది. శిశువు జన్మించినపుడు అందరికీ ఆనందాలు వెదజల్లు తాడు. అదేవిధంగా చనిపోయి నప్పుడు అందరికీ కన్నీళ్ళు మిగిల్చి అనంతవాయువుల్లో కలిసిపోతాడు.శరీరం మాత్రం తన ఆకృతిని కోల్పోయి కాలి పోవడమో, భూగర్భంలో కలిసి పోవడమో జరుగుతుంది. ఇది సృష్టి ధర్మం. మనందరికీ తెలి సిననగ్నసత్యం.ఉపనిషత్తులలో కూడా మానవ జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణించారు. బా ల్యాన్ని ఉదయంతోను,మధ్యా హ్నం యవ్వనంతోను,సాయం కాలాన్ని వృద్ధాప్యంతోను,రాత్రి ని మరణంతోను వర్ణించారు.
బాల్యం ఎంత ఆనందంగా గడుస్తుందో, అంతే బాధాకరం గా వృద్ధాప్యం నడుస్తుంది.
ఈ వృద్ధాప్యం అనేది మనిషి జన్మలో అతి ముఖ్యమైంది.
ఆరు పదుల జీవితం కొందరికి వెలుగులు, మరికొందరికి చీక టి వెలుగులు పంచి పెడు తుం ది.60సంవత్సరాలవయస్సువరకు మనిషి జన్మ ఓ విధంగా నడిస్తే ఆపై వచ్చే దశనే వృద్ధా ప్యం అంటారు. హాయి హాయి గా గడిచే జీవితంలోఅనూహ్య మార్పులు చోటుచేసుకొంటూ వచ్చి చివరికి మనిషిని మ్రగ్గిన పండులా మార్చి రాలిపో యే లా చేస్తుంది వృద్ధాప్యం.అ న్ని కష్టాలు 60 నుండే ఆరంభం అవుతాయి. ఆరోగ్య, మానసి క,సాంఘికసమస్యలుప్రతిమని షిలోనూ తలెత్తుతాయి.ఆర్థి క పరిస్థితులు చాలా గొప్పగా వున్నా ఈ సమస్యలు మాత్రం అందరిలో వస్తాయి. ఎంతో అందంగాకాపాడుకొంటూవచ్చిన మానవ దేహం రిపేరుకొచ్చే స్తుంది. శరీరంలోని ఒక్కో అంగం నిస్సత్తువ అవుతూ వస్తుంది. కొందరికి ముందుగా పంటి సమస్యలు, కంటి సమ స్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కొందరిలో 60 సం.లనుండి ఆరంభం అయితే, మరికొంద రికి 65 సం.లో ప్రారంభమవు తాయి. కొందరు వేగంగావెళ్లిపో తారు. ఇంకొందరు కాస్త నెమ్మ దిగా నడుస్తూ వెళ్లిపోతారు. అందరూ చేరే గమ్యం ఒక్కటే! కర్మసిద్ధాంతాలతోమిగిలినవారు సరిపుచ్చుకుంటారు. ఇది జీవనతరంగం. అన్నేళ్ళ ఆనం దాలన్నీ ఆవిరైపోయి శేషజీవి తం విషాదంతో ముగుస్తుంది. భగవంతుడు ఒక్కసారిగా మనిషికి వృద్ధాప్యంలో కష్టాల్ని ఆరంభిస్తాడు. ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ఒకదానికొకటి తోడై బాధిస్తాయి. ఆలోచనలు పెరుగుతాయి. కానీ క్రమంగా ఆలోచించేశక్తి సన్నగిల్లుతుంది. ఎంత గింజుకున్నా కొన్ని గుర్తు కురావు. మనకు కావాల్సిన వ్యక్తుల్నే మనం గుర్తించలేము. ఒక్కోసారి ఆత్మీయుల పేర్లను కూడా మరచిపోతాం. మందు బిళ్ళలు వేసుకొన్నా అవి మన కు పూర్వశక్తినితీసుకురాలేవు. కొందరికైతే శరీరంలో శక్తి పూర్తిగా నశిస్తుంది. నడుం నొప్పులు, కీళ్ళనొప్పులు ఇంకా ఇంకా ఎన్నెన్నో.. బాధలుఅపరి మితం. ఒక్కోసారి అసహనం, కోపంకూడావృద్ధాప్యాన్నివెక్కిరిస్తాయి. చక్కెర వ్యాధిగ్రస్థుల బాధలైతే మరీ వర్ణనాతీతం. ఈదశలో కొందరికి సరైన ఆదరణ కన్పించదు. వాళ్ళ జీవితం మరీ దుర్భరం. ఒంటరి బ్రతుకు. సాంఘికంగా, ఆర్థికం గా మానసికంగా అన్నీసమస్య లే. భార్యలు కోల్పోయిన భర్తలు, భర్తల్ని కోల్పోయిన భార్యల పరిస్థితి మరింత విచారకరం.కొందరు వృద్ధాప్యం లో బాగా డిప్రెషన్‌కు గురవు తారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అందరిపైపెత్తనంచెలాయించాలని చూస్తారు. పిల్లల్ని తమ అదుపు ఆజ్ఞలో ఉంచాలను కొంటారు. అన్ని విషయాల్లో తాము చెప్పిందే శాసనం కావాలనుకొంటారు. కొంతమం ది వృద్ధాప్యంలో మంచానబడి కదలలేని స్థితిలో అచేతనంగా దుర్భరజీవితాన్నిగడుపుతుంటారు. అలాంటివారిని చూసి రెండు కన్నీటిబొట్లు విడవడం తప్పఏంచేయలేం.చాలామంది వృద్ధులు తమ ఇంటికే పరిమితమై జీవిస్తుంటారు. వీళ్లలో ఆత్మన్యూనతా భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరి తోనూకలవాలనుకోరు.ముఖ్యంగా తమకన్నా చిన్న వయసున్న వారితో. కొందరిలో మతిమరుపు ఎక్కువకావడం చాలా అనర్థాలకు కారణవౌ తాయి. రాను రాను చెవుడు కూడా తోడుకావడం మరింత బాధాకరం అన్పిస్తుంది. ఆ వయస్సులో కూడా కొందరిలో ఏదో చేయాలన్న తపన. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
కొంతమంది పిల్లలు వృద్ధుల్ని నిర్లక్ష్యంగా చూస్తారు. మానవ సంబంధాలకన్నా ఆర్థిక సంబం ధాలే ప్రాధాన్యత సంతరించు కొన్న ఈ జన జీవనంలో వృద్ధు ల్ని తమకు భారంగా కూడా భావిస్తారు. ఇలాంటివారికి సమాజంలోని కొందరైనా చేయూతనివ్వాలి.వృద్ధుల్ని పిల్లల్లా చూసుకోవాలి. ఆఖరి దశలో వీరిలో పిల్లల ప్రవర్తనే ఎక్కువ చోటుచేసుకుంటుంది. తమని కూడా చిన్నపిల్లల్లా చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ చిన్న చిన్న కోర్కెలు తీర్చాలి. క్రమం తప్పక చికిత్సలు అందజేయాలి.
వీలైనన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లు, వృద్ధాశ్రమాలు ప్రభు త్వమే నెలకొల్పాలి. ముఖ్యం గా వీరికి అన్ని మందులు ఉచితంగా అందజేయాలి. విధిగా ప్రతి ఆసుపత్రిలో వృద్ధులకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి సబ్సిడీపై చికిత్స జరిపించాలి.మానసికంగా కూడా వీళ్ళకు మనోధైర్యాన్ని నింపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ఇప్పటికే ఆ దిశగా కొన్ని సదుపాయాలను కల్పించాయి. టాక్స్ బెనిఫిట్స్, డిపాజిట్లకు అదనపు వడ్డీ తోపాటు విమాన, రైలు, బస్సు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ లి స్తున్నాయి. బ్యాంకుల్లో కొత్తగా 65 సం.లు దాటిన వృద్ధులకు ప్రత్యేక సహాయం ఏర్పాట్లు చేశారు.వృద్ధులు కూడా జీవిత సత్యాన్ని గ్రహించి ఉన్నం తకాలం హాయిగా, ఆనందంగా ఎలాంటి దురాలోచనలు చేయ కుండా బ్రతకడం నేర్చుకోవాలి.
జననం తథ్యమని.. మరణం తప్పదని గుర్తెరగాలి. తొలి జీవితాన్ని కడవరకూ కోరు కోవడం అత్యాశే. అందరికీ ఆదర్శంగా బ్రతకాలి. కనీసం ఇపుడైనా వయస్సులో అహం కారంతో ఎవరినైనా బాధించి ఉంటే గుర్తు తెచ్చుకుని వీలైతే వారికి క్షమాపణలు చెప్పడం లేదా పశ్చాత్తాపం చెందడం లాంటివి కూడా చేస్తే మంచిది.
దైవచింతన కూడా కొంతవరకు వీరికి మనశ్శాంతిని అందిస్తుం ది. ఇంట్లోనే హాయిగా ఆత్మ విశ్వాసంతో, ఆనందంతో జీవించండి.. ప్రతి ఒక్కరూ కాబోయే వృద్ధులే! అనుభ వాల పాఠం వృద్ధాప్యం.
.


