జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందిస్తా…

జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందిస్తా…

 

-శ్రీలక్ష్మి ఆస్పత్రి ఎండి డాక్టర్ శ్రావణ్ కుమార్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్)

జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందిస్తానని శ్రీలక్ష్మి హాస్పిటల్ ఎం.డి.డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం కామారెడ్డి పట్టణ కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాలులో జర్నలిస్టులకు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కామారెడ్డిలో ని జర్నలిస్టుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. సమాజాన్ని గుణాత్మకంగా తీర్చిదిద్దడం కోసం నిత్యం కృషి చేస్తుంటారని పేర్కొన్నారు. కాగా తన వంతుగా జర్నలిస్టులకు ఆరోగ్య సేవలు అందించడానికి ఎల్లవేళలా సహకరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు పండ్ల రాజు, అధికార ప్రతినిధి గంగాధర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షుడు పండ్ల రాజు మాట్లాడారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు. సమాజం కోసం పని చేసే వారి ఆరోగ్యం పట్ల ఆలోచించి వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ ను అభినందించారు. ఈ రోజుల్లో జర్నలిస్టులు అనేక ఒత్తిళ్లతో కూడిన జీవితాలను అనుభవిస్తున్నారని సరైన వేతనాలు లేకపోయినా సమాజం కోసం కృషి చేస్తారని తెలిపారు. అటువంటి వారికి అండగా నిలవడం ఎంతో అభినందనీయమని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తాము అండగా ఉంటామని తెలిపారు. దవాఖానాలు అంటేనే సామాన్య ప్రజలు సైతం భయపడేలా వైద్యం ఖరీదు అయిపోయిందని అలా కాకుండా మానవీయ కోణంలో ఆలోచించే వైద్యులు మరెంతో మంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని పలువురు జర్నలిస్టు సంఘ ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డిలో వైద్య రంగంలో విశేష కృషి చేసిన వారు ఉండేవారని వారిని సామాన్య ప్రజలు ఇప్పటికీ నిత్యం తలుచుకుంటారని తెలిపారు. అంతటి సామాజిక కోణంలో సేవ చేసిన కామారెడ్డి గడ్డకు ఉందన్నారు. సమాజం కోసం వివిధ రంగాలలో కృషి చేసే వారిని గుర్తించి స్వచ్ఛందంగా ఇలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మందికి ఆరోగ్యాలను కాపాడిన వారం అవుతామని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆరోగ్య శిబిరం నిర్వహించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ కు జర్నలిస్టు సంఘ ప్రతినిధులు రంజిత్, రాజేంద్రనాథ్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు నక్క సిద్దిరాములు, వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!