సంగమేశ్వర్ లో ఇందిరమ్మ గృహప్రవేశం కు నూతన వస్త్రాలు అందించిన కాంగ్రెస్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 19 (అఖండ భూమి న్యూస్)కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి బట్ట స్రవంతి, మధు , మన్నే లావణ్య, నరేష్ ల గృహప్రవేశం చేశారు. నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి గృహప్రవేశం చేసిన సంగమేశ్వర గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, సంగమేశ్వర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని ప్రభాకర్ రెడ్డి, దోమకొండ మండల మాజీ వైస్ ఎంపీపీ పుట్ట బాపు రెడ్డి, నీల నర్సింలు, నీల పోచవ్వ,సడుగు సిద్ధ రాములు, శీలం అశోక్, బట్ట మనోహర్, చాకలి రాము, బట్ట స్వామి, కొమ్ముదశరథం, బట్ట చిన్న స్వామి, బట్ట చంద్రబాబు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



