సంక్రాతి సెలవులను ప్రైవెట్ స్కూల్ & కళాశాలల యాజమాన్యలు కచ్చితంగా పాటించాలి…

*సంక్రాతి సెలవులను ప్రైవెట్ స్కూల్ & కళాశాలల యాజమాన్యలు కచ్చితంగా పాటించాలి…

*సెలవులను పాటించని ప్రైవెట్ స్కూల్ కళాశాల పైన జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి..

*ప్రైవెట్ స్కూల్ & కళాశాలల ఉపాధ్యాయులకు,అధ్యాపకులకు జరిగే శ్రమ దోపిడీని వెంటనే అరికట్టాలి..

*(ఏ. ఐ ,ఎస్, బి) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 9 (అఖండ భూమి న్యూస్);

ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాతి సెలవులను ఈ నెల 10 తేది నుంచి 16 తేది వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవెట్ స్కూళ్ల యాజమాన్యలు కళాశాలల యాజమాన్యలు పాటించాలని *(ఏ, ఐ, ఎస్, బి) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాతి సెలవులను పాటించడంతో పాటు ప్రైవెట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు జరిగే శ్రమ దోపిడీని అరికట్టాలని ఆయన అన్నారు. విద్యాశాఖ నిబంధనలను ప్రతి ప్రైవెట్ స్కూల్ కళాశాలలు పాటించాలని ఆయన అన్నారు. ట్రస్మా సంఘాం పేరుతో ఉండే కొన్ని ప్రైవెట్ స్కూల్ కళాశాలలు సంక్రాతి సెలవులను పాటించకుండా స్కూళ్లను కళాశాలలను నడపాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ సెలవులలో నడిపే స్కూళ్లపైన కళాశాలలపైన జిల్లా విద్యాశాఖ అధికారులు ద్రుష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యాశాఖకు చెందిన కొంతమంది విద్యాశాఖ అధికారులు కొన్ని ప్రైవెట్ స్కూళ్ల యాజమాన్యలకు మద్దత్తుగా ఉండి మనుగడకు సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ప్రైవెట్ స్కూళ్లలో కళాశాలలో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు పీ.ఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,ప్రభుత్వ సెలవులను కచ్చితంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు వర్తింపచేయాలని ఆయన ప్రైవెట్ స్కూళ్ల యాజమాన్యలకు కళాశాలల యాజమాన్యలను ఆయన కోరారు. ప్రైవెట్ స్కూళ్లలో కళాశాలలో అర్హత కలిగిన ట్రైనింగ్ ఉపాధ్యాయులను అధ్యాపకులను ఉద్యోగులుగా తీసుకోవాలని పీ.ఎఫ్,ఈఎస్ఐ కచ్చితంగా కల్పించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవెట్ ఉపాధ్యాయులను అధ్యాపకులను గుర్తించి హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని వాటితో పాటు 5 లక్షల రూపాయల జీవిత బీమాను ప్రైవెట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!