ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాలోచన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 9, ( అఖండ భూమి న్యూస్);
ఆధునిక తెలంగాణ సాహిత్యంపై సమాలోచన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా దోమకొండ కోటలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వెలుగులోకి వచ్చిన సాహిత్యం ప్రజల జీవన విధానాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆధునిక తెలంగాణ సాహిత్యం సమాజంలో మార్పుకు దోహదపడుతూ, నూతన తరానికి స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. సాహిత్య సృష్టికర్తలు సామాజిక బాధ్యతతో రచనలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సాహిత్య ప్రాధాన్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ను సాహితీ వేత్తలు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


