భావితరపు సైంటిస్టులను తయారుచేసిన ఘనత గురువులదే..!

భావితరపు సైంటిస్టులను తయారుచేసిన ఘనత గురువులదే..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 9 (అఖండ భూమి న్యూస్);

గత రెండు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ శుక్రవారం మూడవ రోజుతో ముగిసింది.

రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 870 ప్రదర్శనలు 1700 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని 7 విభాగాలలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. జూనియర్, సీనియర్, నేషనల్ , సౌత్ ఇండియా స్థాయిలకు ప్రతి విభాగం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.

స్థానిక శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రదర్శనను సందర్శించి విద్యార్థులను అభినందించడమే కాకుండా ఒక్కొక్కరికి ప్రాజెక్టు వారీగా వివరాలను అడిగి తెలుసుకుని అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఏ ఉద్దేశంతో తయారు చేశారు తెలుసుకొని వ్యక్తిగతంగా అభినందించారు.

అంతేకాక విద్యార్థులకు సమాజానికి అవసరమైన ఆవిష్కరణ చేయాలని సూచించి ఉత్తేజ పరచడం జరిగింది.

చివరగా ముగింపు సమావేశం గౌరవ శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన చిన్నమైల్ అంజారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

సైన్స్ ఫెయిర్ సందర్భంగా ప్రదర్శించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన సభాధ్యక్షులు రమణా రెడ్డి ఉపాధ్యాయులు పాత్ర గురించి సమాజంలో ఉన్నతమైనదిగా ప్రతి విద్యార్థిని ఎన్నడూ మర్చిపోని విధంగా ఉంటుందని కొనియాడినారు.

అదేవిధంగా విద్యార్థులను విద్య అర్జించడం లోనే కాక

సర్వతో ముఖాభివృద్ధి సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని ఉపాధ్యాయులు ఆ విధంగా కృషి చేయాలని సూచించినారు.

జిల్లా సైన్స్ అధికారి సిద్ధ రామ్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల ఫై వివరించారు. 33 జిల్లాల అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

డైరెక్టర్ నికోలాస్ మాట్లాడుతూ. ప్రభుత్వం అనేకమైన పథకాలను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధి కొరకు , విద్యార్థుల సంక్షేమానికి కొత్త కొత్త కార్యక్రమాలు ఎన్నో చేబడుతున్నామని అవి విద్యార్థుల విద్యాభివృద్ధికే కాక సహ పాఠ్యాంశాలలో అభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయని వివరించినారు.

ముఖ్య అతిథి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులకు విద్యతోపాటు దేశభక్తి కూడా అవసరమని మారుతున్న సమాజపు అవసరాలకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలను రూపొందించాలని ఆ విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని తెలిపాటు.

తదుపరి వివిధ విభాగాలలో ఉత్తమ ప్రదర్శనను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్ల ప్రధానమంత్రి కార్యక్రమం ముగిసింది.

Akhand Bhoomi News

error: Content is protected !!