నేడే వివేకానందుని జయంతి…
నేటి తరానికి అతని బోధనలు అందించాలి ..!
ఆబ్రబోయిన శ్రీనివాస్ సీనియర్ రిపోర్టర్ ( ఎం ఎస్ డబ్ల్యూ);
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 11,(అఖండ భూమి న్యూస్) ;
ఫలితంపై ఎంత శ్రద్ధచూపిస్తారో దాన్ని పొందేపద్దతుల్లోనూ అంతే శ్రద్ధపాటించాలి. మీరు
ఎలా ఆలోచిస్తే అలాగే తయారు అవుతారు. బలహీనులు అని భావిస్తే బలహినూలే అవుతారు.శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థంచేసుకొని ఆచరణాత్మక విధానాలు రూపొందించినవాడు, తానుగా ఆచరించి చూపినవాడు, మనసంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించినవాడు, భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పినవాడు, విశ్వమానవాళి నవశకం వైపు పరుగులు తీయాలనికోరుకున్నవాడు వివేకానందుడు. ప్రపంచ మతసమ్మేళనంలో భారతదేశానికి హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచ వ్యాప్తంగా పలు మతాల సమ్మేళనంలో ప్రసంగిస్తూ ప్రియమైన అమెరికా సోదర ,సోదరీ మణులారా !అనిసంబోధిస్తూ ప్రారంభించడంతో నేశ్రోతలను ఆకట్టుకున్నారు. సాధారణంగా లేడిస్ అండ్ జెంటిల్‌మెన్” అన్న సంబోధనకుల వాటుపడ్డవారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. .ఆయన సందేశానికి, వాక్పటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్ని ప్రశంసించాయి. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్యదేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి వివేకానందుడే.మనసంస్కృతి మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవంగురించి మాట్లాడుతూనే భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యా లేకపోవడం ఏసమస్యనైన విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్యకోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరమని, వేద కాలంలోనే మహిళలు విద్యను అభ్య సించారని,గార్గె, హైత్రేయి వంటి మహిళామణులు పీఠాలను అలంకరించని అంటూ చికాగో సభలోవి వేకానందుడు చెప్పాడు. తనదేశం అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని వ్యక్తం చేశారు. భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవలసి ఉందని అనేవారు. భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత, త్యాగశీలత సహనము ఈ గుణాలతో విలసిల్లే స్త్రీమూర్తియే మాతృమూర్తి అనేవారు.స్త్రీ, పురుషులస మానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు. సమాజా ఆభివృద్ధికి స్త్రీ ,పురుషులు బండికి ఉన్న రెండు చక్రాల వంటి వారని సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలని ఒకరెక్కతో ఎగర లేదని వివేకానంద చెప్పేవారు. భారతీయ తత్వవేత్త, గొప్పమేధావి స్వామి ,వివేకానంద సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. యువశక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మచ్చుతునక.లేవండి.
మల్కోండి గమ్యం చేరేవరకు ఎక్కడ నిలవకండి.ఎప్పుడూ జాగృ తంగానే ఉండండి. బలమే జీవితం,బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకునేవాడు. .ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తిచేసేది వారేనని, అలాంటి యువత ముందు బలిష్టంగాను, జీవసంపన్నులుగాను, ఆత్మ విశ్వాసులుగాను ఋజు వర్తనులుగాను మారాలని, అలాంటి యువత వందమంది ఉన్నాచాలని ఈప్రపంచాన్నే మార్చవచ్చని యువశక్తిని స్వామి వివేకానం కొనియాడారు. జీవితం మిథ్య ఆలోచనను పక్కన పడేసి పని చేయడం మొదలు పెట్టాలంటాడు. నూరేళ్ల పుణ్యకాలాన్ని గాలికి, ధూళికి, దేవుడికి, దయ్యానికి వదిలిస్తే మనంగా బతికేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, పుట్టినందుకు సార్ధకత సాధించేదెప్పుడు అంటాడు. వివేకానంద.దేవుడు పరీరక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు,అంతా నాతలరాత అంటూ కష్టాన్ని తెచ్చుకుంటూ కూచోడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నీజీవితానికి నువ్వే కర్తవు, నీజీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే, నీవిధికి నువ్వే కర్తవు. తలరాత అంటూ వేరేలేదు.నీతలరాతను నువ్వేరాసుకోవాలి. ధాతవు, విధాతవు అన్ని నువ్వే అంటాడు.మనిషి మనిషిగా చక్కగా చల్లగా బతకాలంటే సహనం, శాంతం కావాలి. ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రమాదాలు తప్పుతాయి. క్షణకాలం అసహనంతో అనర్థాలు జరిగిపోతాయి అంటాడు. మనిషి రాణించడానికి విజ్ఞానం వివేకం ఎలా అవసరమో, శాంతం ,సహనం కూడా అంతే అవసరం అంటాడు. లోకంలో చాలా మంది తోచిందనో, తోచలేదనో ఎదుటివారితో మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ల పనులు చెడగొట్టేస్తూ మాట్లా డుతారు. అయిన దానికి, కాని దానికి సలహాలు, సూచనలు అడుగుతుంటారు. అలా చేసి అందరిని ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి. అద్భుతమైన సలహాలిస్తాడు. అలా చేయకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే మధుర అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు అంటాడు. వివేకా నంద.
కనుక పక్కవారి సలహాలు సూచనలు అడగటానికి ముందు మిమ్మ ల్ని మీరు సంప్రదించండి. దాన్నే ఆత్మావలోకనం అంటారు.ఆత్మ విచారణ.చేశాకే మరెవరితోనైనా మాట్లాడండి.అద్భుతాలు చేయడానికి ఇదొక మహత్తరమైన చిట్కా. వివేకానందుడు చెప్పిన సూచనను గౌరవిద్దాం. ఆచరిద్దాం జీవితకాలం బాగుపడుదాం దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దు:ఖానికి మూల కారణం భయమే. నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు. భయ రాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం.


