తప్పుడు ఓటర్ లిస్ట్ కు నిరసనగా మున్సిపల్ ముట్టడికి బిజెపి యత్నం, అడ్డుకున్న పోలీసులు..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఓటర్ లిస్టులలో తప్పుడు పేర్లు నమోదు చేశారని వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత పాలకవర్గం నేతలు తమకు అనుకూలమైన ఓటర్ల పేర్లు నమోదు చేశారని ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తప్పుడు ఓట్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాల్సి ఉండగా ఇప్పటివరకు తొలగించలేదని బిజెపి నాయకులు ఆరోపించారు.
తప్పుడు ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బిజెపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు వినలేదు. ఓటర్ లిస్టులో తప్పుడు పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. 49 వార్డులలో ఓటర్ లిస్టులలో తప్పుడు ఓటర్లను నమోదు చేశారని బిజెపి నాయకులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తప్పుడు ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వీపుల్, పట్టణ బిజెపి అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, వెంకట్, కుంట లక్ష్మారెడ్డి, రజనీకాంత్, రాజు పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


