14న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 13 (అఖండ భూమి న్యూస్);
14 జనవరి 2026 | బుధవారం
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటన వివరాలు
*ఉదయం:10:00 గంటలకు
•ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.14 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
• రూ.2 కోట్ల నిధులతో
ఎల్లారెడ్డి పురపాలక సంఘంలో విలీన గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు & డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరుగుతుంది జరుగుతుంది.
• రూ.4 కోట్ల నిధులతో
పురపాలక సంఘం పరిధిలో సీసీ రోడ్లు & డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
• రూ.5 కోట్ల నిధులతో
పురపాలక సంఘం పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
• రూ.3 కోట్ల నిధులతో
పురపాలక సంఘం పరిధిలో పెద్ద చెరువు వద్ద మల్టీ జనరేషన్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
*మధ్యాహ్నం :12 :00 గంటలకు*
*2కోట్ల నిధులతో* వ్యవసాయ మార్కెట్ నూతన భవనం , మరుగుదొడ్లు మరియు ప్రహరీ గోడ మరమత్తు , వాణిజ్య సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం.
*మధ్యాహ్నం: 02 :30 గంటలకు గాంధారి మండలంలోని
షాద్మల్ తాండా గ్రామంశ్రీ లక్ష్మమ్మ దేవి జాతరలో పాల్గొంటారు.


