అభివృద్ధి దూకుడులో కేరాఫ్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ..!

అభివృద్ధి దూకుడులో కేరాఫ్ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ..!

కామారెడ్డిలో పాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనులు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);

ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ స్పష్టం చేశారు.

బుధవారం కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డు పరిధిలో గల షబ్బీర్ అలీ కాలనీలో ఆయన విస్తృతంగా పర్యటించారు.

సుమారు 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

కాలనీ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు ఈ పర్యటనలో భాగంగా షబ్బీర్ అలీ కాలనీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతూ సీసీ రోడ్లు 25 లక్షల రూపాయల నిధులతో కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

డ్రైనేజీ పనులకు10 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువల నిర్మాణ పనులు ప్రారంభించారు.

కాలనీలో నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కొత్త విద్యుత్ స్తంభాలు మరియు వీధి దీపాలను మంజూరు చేశారు.

తాగునీటి వసతి: ప్రజల దాహార్తిని తీర్చేందుకు తన సొంత నిధులతో రెండు బోర్లను ఏర్పాటు చేయడంతో పాటు, గోదావరి జలాల పైప్‌లైన్ పనులను మంజూరు చేయించారు.

ఇందిరమ్మ ఇండ్లు , పట్టాల పంపిణీపై హామీ అక్రమంగా ఆక్రమించుకొని పేదలకు కిరాయిలకు ఇచ్చుకున్న వారి పట్టాలను రద్దు చేస్తాం అన్నారు.

గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో 20 ఎకరాల్లో ఈ షబ్బీర్ అలీ కాలనీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో, ఈ కాలనీపై ప్రత్యేక దృష్టి సారించాం. అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పట్టాలు అందజేయడంతో పాటు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం” అని ఆయన ప్రకటించారు.

షబ్బీర్ అలీ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.

అధికారం ఉన్నా లేకపోయినా నా ప్రాణం ఉన్నంతవరకు కామారెడ్డి ప్రజల సేవలోనే ఉంటాను అన్నారు.

గత పాలకులు కాలనీల అభివృద్ధిని విస్మరించారు, కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడమే మా లక్ష్యం అన్నారు.

అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు, చేతల్లో చూపిస్తాం. ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాను అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాలనీ ప్రజలు పాల్గొని షబ్బీర్ అలీకి ఘనస్వాగతం పలికారు. తమ సమస్యలను సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేసినందుకు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!