దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి.
– దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ పాత తాలూకా కేంద్రంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బుధవారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో కలసి వినతి పత్రం అందజేశారు. దోమకొండ గతంలోనే సమితిగా, తాలూకాగా కొనసాగిందని దోమకొండకు ఒక చరిత్ర ఉన్నట్లు వివరించారు.
ఇన్చార్జి మంత్రి సీతక్క,, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. అలాగే ఈనెల 30న దోమకొండలో నిర్వహించే ఊర పండగ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకులు ఇలియాస్ కు మర్యాదపూర్వకం కలిసి విన్నవించారు. ఊర పండుగకు ఇంచార్జ్ మంత్రి సీతక్క హాజరయ్యేందుకు కృషి చేయాలని షబ్బిర్ అలీ తో కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సీతారాo మధు, రాజేందర్, స్వామి, మల్లేశం, శంకర్, సంతోష్, లింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


