*చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు*
-18 వేల విలువగల చైనా మాంజా స్వాధీనం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జనవరి: 15 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా అమ్మ వద్దని, హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించిన వినకుండా చైనా మాంజ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై బుధవారం ఆర్మూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. గాలిపటాలు అమ్మే షాపుల్లో పోలీసులు తనిఖీ చేయగా సాయి కృష్ణ షాపులో 19 చైనా మాంజ బండిల్స్ లను జప్తు చేసి, నారాయణ, రవిలను అదుపులోకి తీసుకొని విచారించగా నిజామాబాదులో హోల్ సేల్ షాపు యజమాని జహీర్ ఖాన్ అనే వ్యక్తి నుండి చైనా మాంజ ను తీసుకొచ్చినట్లు చెప్పడంతో ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మాంజ విలువ సుమారు 18 వేల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను ఎవరైనా అమ్మితే అలాంటి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


