నాటి సాంప్రదాయాలు ఏమాయే..?
ఆధునిక పోకడలతో సాంప్రదాయాలకు దూరం అవుతున్న నేటి యువత..!
అబ్రబోయిన శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ (ఎం ఎస్ డబ్ల్యూ);
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15
(అఖండ భూమి న్యూస్):
భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రతి ఇంటి ముందు గోబ్బేమ్మలను ఏర్పాటుచేసి, నవధాన్యాలతో పాటు, రేగు పళ్ళు, ఇతర సాంప్రదాయ పద్ధతులను గతంలో పాటించేవారు. కానీ ఆధునిక ప్రాచ్చత పోకడలతో గత సాంప్రదాయాలకు మనం దూరం అవుతున్నాం. రేగుపండ్లు ఎటుపాయే, నాటు చిక్కుడుకాయలు ఎక్కడికి వెళ్లే, నాటు దోసకాయలు మనకు ఎందుకు దూరం అయ్యాయి, బంతిపూలు మనకు అసలు కానరాకుండా ఎందుకు పోతున్నాయి. తురక బంతిపూలు ఏమాయే, మందార పూలు మల్ల వచ్చేనా. పూర్వం ఆడపిల్లల అందాలు తిరిగి వచ్చేనా. చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల, తెలుగు ఆడపిల్లల పండుగ, తెలుగు సంవత్సర భోగి సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ఇంటిముందు అనేక రకాల ముగ్గులతో, రంగులు అద్ది, రకరకాల గొబ్బెమ్మలను పూలతో అలంకరించి, అర్ధరాత్రి వరకు పనులు చేసే ఆడపిల్లలు, తెల్లవారుజామున శంకరుడు తన త్రిశూలంతో ముగ్గులు వేసిన వాటిపై నుండి వెళ్తాడని ప్రతీక. ఆ ఇంటి ముందు నుంచి వెళ్తే ఆ ఆడపిల్లలకు మంచి జరుగి, మంచి భర్త వస్తాడని పెద్దలు చెప్పేవారు. భోగి పండుగ రోజు కొత్తగా వచ్చిన పంటల ధాన్యాలను వండి, వాటిని కోడి కూత కాలంలోనే ఆ వండిన భోగి పూల గాలను తమ పంటచేలపై చల్లి, ఆ రైతులు ఇంటికి వచ్చి, కాళ్లు, చేతులు కడుక్కొని తమ భార్య పెట్టిన పిండి వంటలను తిని ఆనందించేవారు. ఆడపిల్లల ఆనందం, చిన్నపిల్లల సంతోషం, సంక్రాంతి పండుగ సంబరాల పదవుల పండుగ గా అభివర్ణించేవారు. కనుమ పండుగ రైతు కుటుంబాలలో అరకలు దున్నే ఎద్దులను, పశువులకు స్నానం చేయించి, పూజలు చేసి, కుంకుమ, పసుపు చల్లి, వాటి కాళ్లు మొక్కి సాంప్రదాయం ఉండేది. రైతులు వాటికి కడుపునిండా మీద పెట్టి ఆరోజు వాటితోనే ఏ పని చేయించకుండా ఖాళీగా ఉంచేవారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల పండుగలను సేద్యం చేసే రైతులు పశువులను రోజువారి కంటే ఎక్కువగా కడుపునిండా మీద పెట్టి, నీళ్లు పోసి వాటిని కాపాడుకుంటారు. అరగదున్నే ఎడ్లు సంవత్సరం మొత్తం కూడా రైతన్నలతో సేద్యంలో పాల్గొని రైతులకు తోడునీడగా ఉంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా వాటిని పవిత్రంగా భావించేవారు. ఆ సాంప్రదాయాలను నేటి ఆధునిక సమాజం దూరం చేయడం వలన అనేక దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


