యుద్ధాలతో తన ప్రజల భవిష్యత్తునే అంధకారం చేస్తున్న అమెరికా..?

యుద్ధాలతో తన ప్రజల భవిష్యత్తునే అంధకారం చేస్తున్న అమెరికా..?

పెద్దన్న పాత్ర పోషించాలి, పోట్లాడం మధ్య మార్గం కాదు..!

అబ్రబోయిన శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ (ఎం ఎస్ డబ్ల్యూ);

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 15

(అఖండ భూమి న్యూస్):

ప్రపంచానికి శాంతి, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు నేర్పే దేశంగా తనను తాను ప్రచారం చేసుకునే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాస్తవంగా గత ఐదు దశాబ్దాలుగా అమలు చేస్తున్న విదేశాంగ విధానాలు మాత్రం ప్రపంచ అస్థిరతకు, అమెరికా ప్రజల భద్రత, సంక్షేమానికి సైతం పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలన అనంతరం మనం చూస్తున్న సత్యం ఇది. చరిత్ర గతుల్లో దాగిన చారిత్రాత్మక విషయాలు, భావితరాల కోసం మనం ఆలోచించాలి. క్యూబాలో ఎన్నో ఆంక్షలు విధించి ప్రజాస్వామ్యం పేరుతో యుద్ధం చేసిన అమెరికా అక్కడ ప్రజలలో నుండి ద్వేష భావమే పెంచుకునే తప్ప ఆరాధన భావమేమి లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా చేసిన ఈ సైనిక చర్య వల్ల అక్కడి ప్రజలు ఏకీకృతం అయ్యారు. క్యూబా పై అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు 1960 నుండి నేటి వరకు కొనసాగుతున్న ఆ దేశం వాటిని పట్టించుకోలేదు. అమెరికా అనుకున్నది ఏమిటంటే క్యూబాలో కమ్యూనిస్టు పాలన కూచివేత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ముందుకుపోయినప్పటికీ, 60 సంవత్సరాల తర్వాత సైతం అక్కడ పాలన మారలేదు. వ్యవస్థ కూనలేదు, ప్రజాస్వామ్యం రాలేదు, పైగా వారి ఆర్థిక వ్యవస్థ స్వతహాగా బలపడింది అని నిర్మోహన్మాటంగా చెప్పుకోగలం. అమెరికా చేసిన ఈ యుద్ధం ఎవరి కోసం, ఎందుకోసం, యుద్ధం వల్ల నష్టపోయింది ఎవరు.

శుభ సాధారణ ప్రజల మరణాలు, ఇరువర్గాల సైనికుల బలగాలు, ముందు చూపు లేకుండా అమెరికా పాల్పడిన అనైతిక ఆంక్షలు, యుద్ధం అమెరికావిశ్వాసనేతను దెబ్బ కొట్టాయి. ఒక చిన్న దేశాన్ని మార్చలేక పోతే అవి ఏ పార్టీ శిక్ష విధానాలో, ప్రతికాల రాజకీయాలో, ఒక్కసారి ప్రపంచం ఆలోచించాలి. అమెరికా పక్కన ఉన్న వియత్నం కమ్యూనిస్టు దేశంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంటే వియత్నంపై అమెరికా చేసిన యుద్ధం ఆ దేశ అహంకారానికి పెట్టిన చారిత్రాత్మక తప్పిదం అయింది. కమ్యూనిజం వ్యాప్తి ఆపాలని ప్రపంచం చూస్తుందని చెబుతున్న అమెరికా ఇప్పటికీ కోటి మంది పౌరుల మరణాలు, 58 పైగా అమెరికన్ సైనికుల మృతికి కారణం అయ్యిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలు నేటికీ ఉన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచ సమాజంలో తీవ్రమైన మానసిక గాయంగా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి అమెరికా ఈ రెండు చిన్న కమ్యూనిస్టు దేశాల దాటితే తట్టుకోలేక తోక ముడిచి, వెనుదిరిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఆ పాఠాన్ని అమెరికా వంట పట్టించుకోలేదు. ఫలితంగా క్యూబా, వియత్నం దేశాలు ఇప్పటికీ ప్రజలలో బలమైన కమ్యూనిస్టు రాజ్యాలుగా సుస్థిర స్థానం సంపాదించాయి. ఈ రెండు యుద్ధాలు అమెరికా ఏదో సంపత్తితో చేసినవి కావు. కేవలం సైనిక శక్తిని నమ్ముకుని, మన ఆలోచన ద్వంద విధానమని అమెరికా తెలుసుకొని, అంతిమ పరిష్కారం గుర్తించాలి. క్యూబా, వియత్నం తర్వాత గడిచిన 20 ఏళ్ల తాలిబన్ అంతర్గత యుద్ధం, అమెరికా సహాయం, కారం మార్పు, ఆయుధం తర్వాత అమెరికా తరాల వెంట తాలిబాన్లు, అక్కడి పౌరులు అమెరికా మిత్ర కూటమి దళాలను తరిమి, వారి ఆయుధా, వైమానిక సంపదను దక్కించుకొని తిరిగి బాన్ లు అధికారంలకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఒక చిన్న వైరు దేశంలో అమెరికా వైపల్యం చెందిన విధానం. ఒకప్పుడు అమెరికా గల్ఫ్ వారు పేరుతో 1991లో యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ అధ్యక్షులుగా ప్రకటించి, ఇరాక్ని మిత్ర దేశంగా చేసుకుంది. 2011లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ మీద అనుప్రియ దాడికి అమెరికా దిగింది. జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయని అబద్ధపు కారణాలతో ఆదేశం మీద యుద్ధం ప్రకటించి, ఆ దేశ అధ్యక్షులైన సద్దాం హుస్సేన్ యుద్ధ ఖైదీగా చేసి, ఉరి కంభం ఎక్కించింది. ఆ దాడితో ఆ దేశం నేటికీ అస్థిరత్వం పోయిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చర్యలు మారలేదు, అంతర్గత భద్రత అదే స్థితిలో ఉంది. 2011లో నాటు దళాలతో అమెరికా లిబియన్ దేశం టార్గెట్ చేసింది. ఆ దేశ అధ్యక్షులు గడాఫీని కిరాతకం పైన నియంతగా అమెరికా ప్రచారం చేసి, సైనిక చర్య జరిపి, గడాఫీ కుటుంబం మొత్తాన్ని చంపేసింది. ప్రస్తుతం ఆ దేశంలో శాంతి, సుస్థిరత లేకుండా పోయింది. దేశం ముక్కలైంది, అమెరికా యుద్ధం చేసిన ప్రతిచోట ప్రజాస్వామ్యం విఫలం, ఉగ్రవాదం పెరుగుదల, శరణార్థుల సంక్షోభం, ఎన్నో వైఫల్యాలు మూటగట్టుకున్న అమెరికా వాటిని విజయాలుగా ఎలా భావిస్తుందో వారికే తెలియాలి. అమెరికా 50 ఏళ్ల ఏకపక్ష, ద్వంద విధానాల వల్ల ప్రపంచం ఎన్నో రకాలుగా మూల్యం చెల్లిస్తూ వస్తుంది. అక్కడ ప్రజలపై మోపిన పెనుబారం ఎంతో ఉన్న అమెరికా ఇది దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ యుద్ధాల వల్ల అమెరికా యుద్ధ బాధ్యత దేశాల ప్రజలతోపాటు అమెరికా ప్రజలు ఎక్కువ మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. త్రిలియన్ల డాలర్ల యుద్ధ వ్యయం వల్ల అక్కడ ప్రజల సంక్షేమైనా ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలపై భారం పడుతుంది. అమెరికాలో లక్షమంది వెటర్నలు సమస్యలతో, సంక్షోభంతో జీవనం సాగిస్తున్నారు. హార్దిక లేనివల్ల మాధ్యమిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఈ యుద్ధాల వల్ల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లాలి అంటే అమెరికా ప్రజలకు భద్రత ముప్పు వెంటాడుతుంది. విదేశీయుధాలే ఈ దేశీయ అబద్ధతకు మూలమా అనేది ప్రశ్న గానే మిగులుతుంది. అమెరికా చేపట్టిన యుద్ధాలే ఆయా కొన్ని దేశాలలో అంతర్జాతీయ ఉగ్రవాద ప్రతీకారానికి కారణమయ్యాయి అన్న వాదనలు సైతం బలంగా ఉన్నాయి. అమెరికా నగరాలపై, వ్యక్తులపై దాడులకు ప్రేరణ అయ్యాయన్న ఆరోపణలు నిత్యం బలపడుతూనే వస్తున్నాయి. ఇతర దేశాలలో భద్రత కోసం మొదలైన ఈ అమెరికా యుద్ధాలే ఆదేశంలో అసురక్షిత భావాన్ని పెంచాయి. ఇది విధానపరమైన విపత్తు కాదా అని అమెరికా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రపంచానికి యునైటెడ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉన్న, ఐక్యరాజ్యసమితి ఉన్న సరే అమెరికా ఎందుకో వాటితో పూర్తి విధేయత చూపదు. తన సైనిక చర్యలకు పర్యవేక్షణ అంగీకరించదు. న్యాయం అందరికీ సమానమైతే ఐక్యరాజ్యసమితి సైతం అమెరికాకు ఎందుకు మినహాయింపు ఇస్తుందో మనకు తెలియని ప్రశ్న గానే మిగులుతుంది. బలహీనమైన దేశాలకు అండగా ఉండాల్సిన ఐక్యరాజ్యసమితి కట్టుబడి, సామ్రాజ్యవాద దేశాల పట్ల ఊదశినంగా ఉంటుందని బహిరంగంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అంతర్జాతీయంగా ఆయా దేశాలకు ముప్పు ఎలా ఉంటుందో, పలు దేశాలకు ఐక్యరాజ్యసమితి వారు ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి. అమెరికా దాని మిత్రదేశాలు, ఇతర విద్రోహ దేశాలు ఏమి చేస్తున్నా ప్రపంచ ప్రస్తుతం మౌనంగా ఉందని అనుకోవడం పొరపాటే. అమెరికా యుద్ధ విధానాలపై ప్రపంచ వ్యతిరేకత మొదలైతే ఇది పెద్ద సంక్షోభమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సవాల్ జవాబు అనే రీతిలో అమెరికా కొత్త అంతర్జాతీయ కుటుంబంలో నెలకొల్పితే, అమెరికా మిత్ర దేశాల సైనిక ఆధిపత్యానికి సవాలుగా మారే అవకాశం ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యం కొనసాగితే ప్రపంచంలో అమెరికా ఒంటరిగా అయ్యే ప్రమాదం అతి తొందర్లోనే ఉంటుంది. అమెరికా దాని మిత్రదేశాలు ఏకపక్ష సైనిక చర్యలు, ఇతర దేశాలలోని అంతర్గత వ్యవహారాలలో తల దూర్చడం, వారి ఆర్థిక మూలాలపై కన్ను వేయడం, ఉద్దేశపూర్వకంగా ఆంక్షలు వేయడం, ఇబ్బంది, ముబ్బడిగా కాగితాలు అమ్మకం, ఒకప్పుడు స్నేహంగా ఉండి మళ్ళీ అదే దేశాల క్షేత్రదేశాలుగా చూడడం, ఉగ్రవాదం నడుపుతున్న దేశాలకు, ప్రజాస్వామ్య, కమ్యూనిస్టు దేశాల మనుగడలను దెబ్బతీస్తే, అమెరికాతో పాటు హాయిగా అమెరికా మిత్ర దేశాలు, వీరిని వ్యతిరేకించే దేశాలు, రెండుగా చీలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్యూర్ నుండి ఆఫ్ఘనిస్తాన్ (కాబుల్), వియత్నం నుండి లిబియా వరకు, గ్రేనేడా, ఇరాక్ (రెండుసార్లు), యువోస్లోవియా, సిరియా, సోమాలియా, ప్రస్తుతం వెనిజులలో ప్రపంచం కన్నుల్లో దాగి ఉన్న సత్యం ఇదే. పాకిస్తాన్, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, ఈజిప్టు, ఉక్రెయిన్ దేశాలకు హాయిగా సైనిక సహాయము అమెరికా చేస్తుంది. అమెరికా గ్రహించాల్సింది ఏమిటంటే ఎప్పటికి యుద్ధం ప్రజాస్వామ్యాన్ని తీసుకురాదు అనే నగ్నసత్యాన్ని గ్రహించి, ఏదేశ ప్రజలకు కూడా భద్రత ఇవ్వదు అని నమ్మి, అమెరికాకు నిజంగా ప్రపంచ నాయకత్వం కోరుకుంటే యుద్ధాన్ని వదిలి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను పాటించాలి. శాంతి, సుస్థిరత కోసం పనిచేయాలి. ఆర్థిక స్వార్ధాన్ని వీడి, ఉద్దేశపూర్వకంగా కాకుండా పంచిక న్యాయ సూత్రాల ప్రకారం ఏదైనా చేయాలి. రాజ్య దేశాలతో స్నేహాన్ని ఇప్పుడు ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారనే విషయాన్ని గ్రహించి, ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా పనిచేయాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!