ఎన్‌టీవీ విలేకరుల అరెస్టులను ఖండిస్తూ ధర్నా
– టిడబ్ల్యూజేఎఫ్ మద్దతు
– కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 16 (అఖండ భూమి న్యూస్);
ఎన్‌టీవీ విలేకరుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్‌టీవీ విలేకరులు నిర్వహించిన నిరసన ధర్నాకు టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించి పాల్గొంది. ఎన్‌టీవీ విలేకరులు టిడబ్ల్యూజేఎఫ్ మద్దతు కోరగా, దానికి సానుకూలంగా స్పందించిన టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా నాయకులు, సభ్యులు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కృష్ణమాచారి, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ లు మాట్లాడుతూ జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఎన్‌టీవీ విలేకరులకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల అరెస్టులను వెంటనే రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…


