కోట్లు పెట్టి కొనుక్కో లేని బాల్యం.. మళ్లీ కోరుకున్న రాని ఈ మానవ జీవితం..!

బాల్యం జీవితం గడిచిపోయిన గడియారం లాంటి సమయం..
నాడు రియల్ హీరోలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 16 (అఖండ భూమి న్యూస్);
బాల్యం నాటి తీపి గుర్తులు నెమర వేసుకుంటే తిరిగిరాని అనుభూతి జ్ఞాపకాలకే నిదర్శనంగా మిగులుతుంది.
కోట్లు పెట్టి కొనుక్కున్న తిరిగిరాని బాల్య జీవితం , జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటే గడిచిపోయిన గడియారం లాంటి సమయం లా ముగిసింది. నాటి తరం పిల్లలు టెక్నాలజీ లేదు, కంప్యూటర్ కాలం కాదు, దూరదర్శన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఈ తరంలో మనిషి అన్నవాడు బిజీగానే మిగిలిపోయాడు. ఆనందం, అనుబంధం, ప్రేమ అనురాగాలు, బంధుత్వాలు, రక్తం పంచుకున్న కుటుంబాలు ఈ బిజీ జీవితంలో ఎవరికి వారే దూరమై బతుకు బాట కోసం ఎదురీగుతూ జీవిస్తున్నారు. ఇంటర్నెట్ ఫోన్లో నిమగ్నమై ప్రపంచాన్ని శాసిస్తూ అరచేతిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ కాలంలో నాటి బంధాలు, బంధుత్వాలు, నాటి ఆట, పాటలు పల్లెల్లో దూరమైనాయి. పల్లెలు సైతం నాటి కంప్యూటర్, సైన్స్, టెక్నాలజీ కాలంలో కాలానుగుణంగా మనిషి అన్నవాడు బంధాలకు దూరమై సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. పల్లెల్లో సైతం నాటి ఆటపాటలు, స్నేహాలు, స్నేహితులు నాటి గోలిలాట, చిర్రగోనే, కుప్పిగంతులు,, ఆటపాటలు దూరమై పల్లెలకు దూరమై పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. పల్లెల్లో కులవృత్తులు, నాటి ఆటలు, పాటలు, నాటకాలు, హరికథలు అడ్రస్ లేకుండా పోయాయి. అప్పటి మనుషులు ప్రస్తుతం జీవిస్తున్న వారికి పిల్లల బాల్యంపై తేడాలు గమనిస్తున్నారు. ఆటపాటలకు దూరమై, పల్లెలకు దూరమై, చదువులమ్మ కోసం పట్టణాలకు వెళ్లి విద్యనుభ్యసించి, బతుకుబాట కోసం ఉద్యోగం, సంపాదన కోసం ఈ తరం పిల్లలు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాలం మారినకొద్ది, మనుషులు మారుతున్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


