*తీన్మార్ మల్లన్న పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి: జనవరి 17 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు అండగా నిలవడం, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయడం తీన్మార్ మల్లన్న ఆలోచనలకు ప్రతీక అని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సామల వెంకటేశం.
జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు సిగదపు సిద్ధన్న
కార్యదర్శి జావేద్.
ఎండీ ఫసియుద్దీన్
రవి తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


