*రూ.5 వేలతో ఆశపెట్టి.. ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.9 కోట్లు స్వాహా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి! జనవరి 19 (అఖండ భూమి న్యూస్);
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. గతేడాది నవంబరు 12న వాట్సాప్‌లో వచ్చిన లింకు ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సలహాలు ఇచ్చే గ్రూపులో చేరిన బాధితుడు, అనిల్ గోయల్ అనే వ్యక్తి చెప్పినట్లుగా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. 300 శాతం లాభాల ఆశతో మొదట రూ.50 వేలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత మొత్తం రూ.2.9 కోట్లు బదిలీ చేశాడు. యాప్‌లో రూ.3.47 కోట్లు కనిపించినా, డబ్బును విత్‌డ్రా చేసుకోలేక మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


