*జాతీయ అవార్డు పొందిన అధ్యాపకుడికి ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);
ఈనెల 10 న భువనేశ్వర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సెమినార్ లో సౌత్ క్యాంపస్ సోషల్ వర్క్ హెడ్ అయిన డా. అంజయ్య బందెల ను “భారత్ వికాస్ అవార్డ్ ” తో సత్కరించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ ,ఒడిశా లోని ప్రెస్ క్లబ్ లో *పచ్చని భవిష్యత్ దిశగా పునర్నిర్మాణం*అనే అంశంపై జాతీయ సదస్సు ను ఈ జనవరి 10 న నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు వేదికగా నిలిచింది. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మేధావులకు అవార్డ్ లతో సత్కరించారు. ఈ సందర్భంగానే డా.అంజయ్య బందెల ను భారత వికాస్ అవార్డ్ తో సత్కరించారు.
దీన్ని పురస్కరించుకొని సౌత్ క్యాంపస్ లో నేడు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ ఆద్వర్యంలో సన్మానించారు.
ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపస్ అధ్యాపకుడికి అవార్డ్ రావడం చాలా సంతోషం అన్నారు. ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి అవార్డ్ ఇచ్చారని అన్నారు. అలాగే మిగతా అధ్యాపకులు స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్లో అవార్డ్ లు సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. రాజేశ్వరి,హాస్టల్ వార్డెన్ డా.సునీత, NSS అధికారి డా.హరిత లక్కరాజు,apro డా. సరిత పిట్ల, అధ్యాపకులు డా.సబిత, డా.లలిత,డా.మోహన్ బాబు,డా.నాగరాజు,డా.కవిత తోరణ్, డా.ప్రతిజ్ఞ,డా.నారాయణ,డా.నరసయ్య,డా.రమాదేవి, వైశాలి,సునీల్, శ్రీనివాస్,డా.కనకయ్య,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


