స్థాయిని మరచి మాట్లాడటం మంచిది కాదు.వైకాపాశ్రేణులు.
యర్రగొండపాలెం, అఖండ భూమి.
అంబేద్కర్ సిద్ధించిన రాజ్యాంగంతో ప్రజాక్షేత్రంలో గెలుపొందిన మా నాయకుడిని దళితుడు కాబట్టి వదిలివేస్తున్నాము అంటూ అధికార మదంతో అగ్రకుల దురహంకారంతో మాట్లాడిన మాటలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకొనవలసి వస్తుందని యర్రగొండపాలెం నియోజకవర్గ వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు అధికార మదంతో మాట్లాడారని నైతిక విలువలతో మాట్లాడాలని ప్రజాక్షేత్రంలో భవిష్యత్తులో మీరే ఇబ్బందులు పడతారు అన్నారు.పట్టణంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం నాడు పాత్రికేయుల సమావేశం నిర్వహించాగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు ఒంగోలు మూర్తి రెడ్డి లతోపాటు పలువురు నాయకులు మాట్లాడుతూ దళితులంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి చిన్న చూపే అన్నారు.సంక్రాంతి సంబరాలలో భాగంగా జాతీయ స్థాయిలో సంస్కృతి సంప్రదాయాలలో జరిగిన ఎద్దుల పోటీ కార్యక్రమాన్ని గాడిదల పోటీలు కుక్కల పోటీలు అని విమర్శించారని మరి అదే రీతిలో చిలకలూరిపేట నరసరావుపేట లో జరిగిన అధికారపక్షపు నాయకులు ఏర్పాటు చేసినవి కూడా అవేనా అంటూ ప్రశ్నించారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని ఎలా మాట్లాడడం మీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. నాయకుడు అనేవారు పలువురికి ఆదర్శంగా నిలవాలని అలా కాక కొడతాము చంపుతాము అంటే ఊరుకుండే కార్యకర్తలం కాదని నిక్కర్లు వేసుకున్న నాటి నుండే మేము చాలా కార్యక్రమాలు నిర్వహించి ఉన్నామని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. మీరు చేసిన తప్పులను ప్రశ్నిస్తే ఎలా అధికారం అదంతో కుల దురహంకారంతో మాట్లాడితే భవిష్యత్తులో పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు.మీరు చేస్తున్న అవినీతి గురించి మీ పార్టీ నాయకులే నిత్యం అధిష్టానానికి విన్నవిస్తున్న విషయం మీకు తెలుసో లేదో కానీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమన్నారు. రైతులు పొలాలలోకి మట్టి తీసుకోవాలంటే కప్పం, ఇసుకకు అదనంగా వసూళ్లు, మద్యం కు నెలవారి వాటాలు, కాంట్రాక్టు పనులు బదిలీలు కావాలంటే అక్రమ వసూళ్లు ఎవరికి తెలియని భాగవతాలంటూ వారు ప్రశ్నించారు.త్రిపురాంతకం కంకణాలపల్లి లో తమ హాయంలో జరిగిన పనులకు 5 లక్షల నిధులను డ్రా చేసుకున్నారని అవి ఎవరి జేబులోకి వెళ్లాయన్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరు ఉన్నారు,ఎవరు అవినీతిమయం చేస్తూ నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు అన్నారు.అధికార మదంతో మాట్లాడుతున్న వారు భవిష్యత్తులో ఎవరి వైపు ఉంటారో కూడా అందరికీ తెలిసిన విషయం అని తెలిపారు.అసలు సంక్రాంతి సంబరాలను ఇలా ఎగతాళిగా మాట్లాడటం ఓర్వలేని తనంతో సభ్యత మరిచి మాట్లాడడం నైతిక విలువలు లేనివారే చేస్తారన్నారు.మా శాసనసభ్యులను విమర్శించే స్థాయి కానీ ఆయనను ప్రశ్నించే హక్కు ఇలా ప్రజలను పట్టిపీడిస్తున్న వారికి లేవన్నారు. నిజంగా నియోజకవర్గంపై అంతటి ప్రేమ ఉంటే అభివృద్ధి చేయండి వాటిని హర్షిస్తాము కానీ ఇలా అడ్డు అదుపు లేకుండా ఆ సందర్భంగా విలువలు దిగజారి మరి మరోసారి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. వైకాపా హయాంలోఅభివృద్ధి జరగలేదు మా హాయంలోనే అభివృద్ధి జరిగిందంటూ చెప్పుకుంటున్నారని మంచి విషయమేనని అభివృద్ధి చేస్తే నియోజకవర్గ ప్రజలే హర్షిస్తారు భవిష్యత్తు నిర్ణయితలుగా ఓటర్లే ఉంటారని అన్నారు. అలా కాక చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తుంటే ఎ గతాళిగా గ్రూపులలో చిల్లర రాజకీయాలు చేయడం చూస్తుంటే మీ ఇన్చార్జి కి మీరే భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అనుమానం నియోజకవర్గ ప్రజల్లో కలుగుతుందన్నారు.మా నాయకుడికి సీటు ఉండదు అని మీరే న్యాయ నిర్నేతల వలె తెలియజేస్తున్నారని మీరు చేస్తున్న చేపడుతున్న ఈ అవినీతి అక్రమాల కారణంగా మీ ఇన్చార్జికి స్థానిక సంస్థలు ఎన్నికల అనంతరం సీటు ఉంటుందో ఊడుతుందో ఆలోచించుకోవాలన్నారు. గడిచిన రెండేళ్లలో మీరు చేసిన అవినీతి చిట్టా నియోజకవర్గ ప్రజలతో పాటు మీ అధిష్టానం వద్ద కూడా ఉందని ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకన్నా నియోజకవర్గ ప్రజలకే బాగా తెలుసు అన్నారు.అలా కాక ఇలాగే మేము అధికార మదంతో మాట్లాడుతాము దోచుకుంటాము దాచుకుంటాము ఇది మా ప్రభుత్వం అంటే న్యాయం ఎన్ని నేతలుగా రానున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో ప్రజలు తీర్పును నిర్ణయిస్తారన్నారు. రాజకీయాలను రాజకీయాలవలె చేయాలని కానీ అలా కాక ఇటువంటి రాజకీయాలు చేసి ప్రజలలో విలువను పోగొట్టుకోవద్దంటూ హెచ్చరించారు.మీరు చేస్తున్న ఇటువంటి రాజకీయాలు స్థానిక సంస్థల ఎన్నికలలోని ప్రజలు ఎలా తీర్పునిస్తారు వేచి చూడమంటూ వారు కోరారు. మరో మారు మా శాసనసభ్యులపై అవాకులు చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని,స్థాయి తెలుసుకొని మాట్లాడమని కోరారు.



