తిరుమలగిరి కాలనీలో పోలీసుల తనిఖీ

తిరుమలగిరి కాలనీలో పోలీసుల తనిఖీ

యర్రగొండపాలెంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు.

యర్రగొండపాలెం అఖండ భూమి.

యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డీఎస్పీ నాగరాజుల ఆదేశాల మేరకు సీఐ కె. అజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో ‘కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు

తెల్లవారుజామునే కాలనీని దిగ్బంధించిన పోలీసులు.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. గంజాయి, మత్తు పదార్థాలు, మారణాయుధాల నిల్వలపై ప్రత్యే కంగా సోదాలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించారు.

అనుమతుల్లేని 22 బైకులు స్వాధీనం

అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఈ సందర్భంగా సీఐ అజయ్ కుమార్ మాట్లా డుతూ ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకే ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్లు ద్వారా మొబైల్స్కు వచ్చే గుర్తుతెలియని ఏపీకే లింక్లను ఓపెన్ చేయవద్దు. బ్యాంకు వివరాలు, పిన్, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పవద్దు.

మూఢనమ్మకాలు పూజలు, మంత్రాల పేరుతో నమ్మించే మోసగాళ్ల మాటలు విని డబ్బులు పోగొట్టుకోవద్దు. చిట్ ఫండ్స్ అనుమతి లేని ప్రైవేటు చిట్లలో చేరి ఆర్థికంగా నష్టపోవద్దు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామనే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని చూచనలు ఇచ్చారు. ఈ తనిఖీలో సిఐతో పాటు ఎస్సైలు పి.చౌడయ్య, సంపత్ కుమార్, శివ బసవరాజు, పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!