కబాడీ విజేతలకు బహుమతులు అందజేసిన గూడూరి ఎరిక్షన్ బాబు

కబాడీ విజేతలకు బహుమతులు అందజేసిన గూడూరి ఎరిక్షన్ బాబు

 

యర్రగొండపాలెం అఖండ భూమి:యర్రగొండపాలెం

పట్టణంలోని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్రస్థాయి మూడు రోజులు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ 36 టీములు పోటీల్లో పాల్గొనగా 4టీములు విజేతలుగా నిలిచాయి 1 మొదటి బహుమతి 15 వేలు అయోధ్య టీం 2 రెండవ బహుమతి 10 వేలు హనుమాన్ టీం 3 మూడో బహుమతి 5 వేలు నెల్లూరు టీం 4 నాలుగో బహుమతి 3 వేలు గంజి వారి పల్లి టీం వారికి గూడూరి ఎరిక్షన్ బాబు చేతులు మీదుగా ప్రైజ్ మనీ, షీల్డ్,మెడల్స్ అందజేసి పోటీల్లో గెలుపొందిన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా నైపుణ్యత కలిగి ఉండాలని చెప్పారు.ఈ పోటీలకు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కళా పరిషత్ కబడ్డీ పోటీలకు చీదెళ్ల నాగేశ్వరరావు, మెడబలిమి అచ్యుత్ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, పుల్లల చెరువు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోట్ల గోవిందు, పెద్దరవీడు మెట్టు శ్రీనివాసరెడ్డి త్రిపురాంతకం మండల పార్టీ అధ్యక్షులు మేకలవలరాజా, త్రిపురాంతకం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస చౌదరి, పట్టణ అధ్యక్షుడు పెరుమాళ్ళ మల్లికార్జున,టీడీపీ ఐటీ అండ్ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ నాయకులు

అధ్యక్షులు కందుల మల్లిఖార్జునరెడ్డి, సభ్యులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, చిట్యాల నాగార్జునరెడ్డి, పడిదపు వెంకట్రావు, కందుల రోహిన్ కుమార్,టిడిపి నాయకులు శనగా నారాయణ రెడ్డి, వేగినాటి శ్రీనివాస్,షేక్ మస్తాన్ వలి,షేక్ ఇస్మాయిల్, తోట మహేష్ నాయుడు, చిదెల నాగేశ్వరరావు, మెడ బలిమి అచ్యుతరావు, లింగాల అబ్రహం,జెడ్డా రవి,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!