మహిళా సాధికారతకు ‘చేయూత’.. కామారెడ్డిలో వడ్డీ లేని రుణాల సందడి..!

మహిళా సాధికారతకు ‘చేయూత’.. కామారెడ్డిలో వడ్డీ లేని రుణాల సందడి..!

 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 20 (అఖండ భూమి న్యూస్);

582 సంఘాలకు ₹1.91 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.

కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియం సోమవారం జనసందడిగా మారింది.

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో జరిగిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం మహిళా లోకంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి, 582 స్వయం సహాయక సంఘాలకు కలిపి రూ. 1,91,83,496 (ఒక కోటి 91 లక్షల 83 వేల 496 రూపాయల) చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ.

మహిళల ఆర్థిక ఎదుగుదలే ప్రభుత్వ లక్ష్యం.

ప్రతికుటుంబానికి వెన్నెముక మహిళ.

ఒక ఇంటి అభివృద్ధి ఆ ఇంటి ఆడపడుచు ఆర్థిక స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతోనే మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది.

ఈ నిధులు మీ వ్యాపారాలకు, మీ పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి కావాలి.

గతంలో వడ్డీలు కట్టలేక మహిళా సంఘాలు పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ భయం వద్దు. పైసా వడ్డీ లేకుండా ప్రభుత్వం మీకు అండగా నిలుస్తోంది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి.

కామారెడ్డిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడతాం. ముఖ్యంగా మహిళా సాధికారత విషయంలో ఎలాంటి రాజీ పడబోం. మెప్మా ద్వారా ఇలాంటి ఎన్నో పథకాలను నేరుగా మీ దరికి చేరుస్తాం అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.

ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాలను మహిళలు సరైన మార్గంలో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని నిధులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లా యంత్రాంగం మహిళా సంఘాల బలోపేతానికి ఎల్లప్పుడూ సహకరిస్తుంది,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో మరియు ఇతర శాఖల అధికారులు, భారీ సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లబ్ధి పొందిన మహిళలు షబ్బీర్ అలీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!