*భారత్‌తో ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్..’!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు వైపులా ప్రతినిధులు సాగిస్తున్న చర్చల్లో పురోగతి ఉందని, చరిత్రాత్మక ఒప్పందానికి ఈయూ-భారత్ అతి దగ్గరలో ఉన్నాయని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయాన్ అన్నారు.
దావోస్ ఆర్థిక సదస్సుకు హాజరైన ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నాం. దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా కొంతమంది పేర్కొంటున్నారు. ఒప్పందంపై కసరత్తు ఇంకా కొనసాగుతున్నది. ఒప్పం దం కుదిరితే.. *దాదాపు 200 కోట్ల మందితో కూడిన మార్కెట్‌ను ఈ ఒప్పందం సృష్టిస్తుంది’ ఆమె అని అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


